09/10/2018
దక్షిణ కాశి గా విరాజిల్లుతున్న అలంపురంలో వేంచేసియున్న శ్రీ జోగులాంబ సమేత శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరుగుతాయి...
ముందుగా 10వ తేదీ ఉదయం బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యవ వచనం రుత్విక వరణం, మహా కలశ స్థాపన, అగ్ని ముఖము... సాయంత్రం అంకురార్పణ ధ్వజ రోహణంతో కార్యక్రమాలతో ప్రారంభ మవుతావుతుంది.
ప్రతి రోజు అమ్మవారికి సహస్ర నామార్చన, చండి హోమం, దర్బారు సేవ... సాయంత్రం దర్బారు సేవలో నవ దుర్గల అలంకారంతో కుమారీ సువాసినులచే పూజలందుకొంటుంది.
15వ తేదీ సోమవారం మూల నక్షత్రంలో ఉదయం10 గంటలు శ్రీ జోగులాంబ సామెత శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామీ వార్ల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం సాయంత్రం అమ్మవారి సింహ వాహన సేవ....
17వ తేదీ బుధవారం దుర్గాష్టమి, మహర్నవమి ఉదయం 10 గంటల నుండి అమ్మవారి రథోత్సవం... రాత్రి కాళ రాత్రి పూజ జరుగును....
18వ తేదీ ఉదయం 8 గంటల నుండి మహా పూర్ణాహుతి, సాయంత్రం 4 గంటల నుండి షమీ పూజ, ధ్వజ రోహణం.. అనంతరం తెప్పోత్సవం కార్యక్రమంలో తుంగభద్రా నదిలో తెప్పపై వున్నా సింహాసనం మీద కూర్చుని స్వామి అమ్మవార్లు భక్తులకు కనువిందు చేయనున్నారు...
ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులను కటాక్షిస్తుంది... 10వ తేదీ (మొదటి రోజు) శైల పుత్రిగా, 11 వ తేదీ (రెండొవ రోజు) : బ్రహ్మచారిణిగా, 12వ తేదీ (మూడవ రోజు) చంద్ర గంట దేవిగా, 13వ తేదీ (నాలగవ రోజు) కూష్మా0డా దేవిగా, 14వ తేదీ (ఐదవ రోజు) స్కంద మాతగా, 15వ తేదీ (ఆరవ రోజు) కాత్యాయని దేవిగా, 16వ తేదీ (ఏడవ రోజు) కాళ రాత్రిగా, 17వ తేదీ (ఎనిమిదవ రోజు) మహా గౌరిగా, 18వ తేదీ (తొమ్మిదవ రోజు) సిద్ది ధాత్రి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తుంది...
ఇక్కడ జోగులాంబ దేవాలయంతో పాటు కొన్ని ఉపాలయాలు కూడా వున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ యోగ నరసింహ స్వామి దేవాలయం. శ్రీ కంచి కామాక్షి దేవాలయాలలో కూడా పూజలు నిర్వహిస్తారు.. 17వ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి కళ్యాణోత్సవం, 18న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం పై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.. 18వ తేదీ యోగ నరసింహ స్వామి అలయంలో దశమి రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ యోగా నరసింహ స్వామి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది.
కంచి కామాక్షమ్మ అమ్మవారి ఆలయంలో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రతీ రోజు ప్రత్యేక పూజలు, నీరాజన మంత్రం పుష్పాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు..
నవ బ్రహ్మ ఆలయాలు కూడా వున్నాయి... ఈ ఆలయాల్లో కూడా విశేష పూజలు నిర్వహిస్తారు....
బాలబ్రహ్మేశ్వర స్వామీ దేవాలయాన్ని ఆనుకుని శ్రీ రేణుక దేవి ఆలయం కూడా ఉంటుంది... పిల్లలు కలగని వాళ్ళు అక్కడకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తే పిల్లలు పుడతారని ప్రతీది...
చుట్టూ ప్రక్కల ప్రాంతాన్నీ ఆస్వాదించాలనుకునే వారు పాపనాశనం, సంగమేశ్వర స్వామి దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చు... సూర్య నారాయణ స్వామి, అంజనేయ స్వామి దేవాలయాలు, గట్టుపై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి, సంగమేశ్వర స్వామి దేవాలయంగా అలంపూర్ లోకి అడుగు పెట్టక ముందే గుడి దర్శనమిస్తుంది.. పాపనాశనం దేవాలయం వూరికి కొంచం దూరంలో నెలకొనింది. అక్కడికి వాహన సౌకర్యం కూడా వుంది. కళాకారులకు మంచి నేత్రా నందం... ఎందుకంటే అక్కడి దేవాలయాలు, గోడలపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యం ఉట్టి పడుతూ ఉంటుంది... భక్తులు వీక్షించి తరిస్తారని ఆశిస్తున్నాం.... శ్రీ జోగులాంబ....