భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం-భక్త సమాజం

  • Home
  • India
  • Bhadrachalam
  • భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం-భక్త సమాజం

భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం-భక్త సమాజం it is completely for devotional.
(1)

భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రం గోదావరి నది తీరమున ఉన్న ఒక పట్టణం. ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ., కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.భద్రాచలం రెవెన్యూడివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర,హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లాను ఏర్పరిచేసమయములో దీనిని

ప్రస్తుత ఖమ్మం జిల్లాలో విలీనము చేయటము జరిగింది.భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. 8.4.2002న G.O.Ms.No.118 (PR & RD), ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడినది.భద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపలిటిగా ఎదిగినప్పటికీ ఎక్కడ ఉన్న 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని గ్రామపంచాయితీ గా మార్చుట జరిగింది.
2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి భూక్యా శ్వేత ఎన్నికైనారు.
రామాలయ ప్రశస్తి:శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం
పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + అచలం) అని పేరు స్థిరపడింది. దీనినే రామాలయం అని కూడా అంటారు.
గ్రామ చరిత్ర
గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను(6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.
దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.
భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు.
రవాణా సౌకర్యాలు
మండలకేంద్రమైన భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.
గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.
వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్‌ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్‌ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది
కొన్ని వివరాల
భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002లో శ్రీరామ దివ్యక్షేత్రం పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవిన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్ధికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్ధిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.
లోక్‌సభ నియోజకవర్గం: మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం (పునర్విభజన అనంతరం)
శాసనసభ నియోజకవర్గం: భద్రాచలం శాసనసభ నియోజకవర్గం
రెవిన్యూ డివిజను: భద్రాచలం
చూడదగ్గ ప్రదేశాలు
భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం
దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు
కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి
పర్ణశాల: వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
పాపి కొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.

30/08/2025
27/08/2025

🚩 భద్రాద్రి భక్త సమాజం భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం-భక్త సమాజం సమర్పించిన శ్రీ రామకోటి పుస్తకాల నిమజ్జనం 🙏

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నేడు ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు.
22/08/2025

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నేడు ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు.

🚩శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (*పునర్వసు* )ని పురస్కరించుకొని          *భక్తరామదాసు ట్రస్ట్* కొత్తగూడెం నిర్వాహకులు శ్రీ...
20/08/2025

🚩శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (*పునర్వసు* )ని పురస్కరించుకొని
*భక్తరామదాసు ట్రస్ట్* కొత్తగూడెం నిర్వాహకులు శ్రీ కంచర్ల శ్రీనివాసరావుగారి ఆధ్వర్యంలో భద్రాద్రి ఆలయ సహకారంతో
*భద్రగిరి ప్రదక్షిణ* కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
భద్రమహర్షి తపస్సు ఫలితంగా వైకుంఠం నుండి శ్రీమన్నారాయనుడే స్వయంగా భద్రమహర్షిపై కాలిడిన పుణ్యప్రదేశం.
యః పూజయతి శ్రీరామా!

నక్షత్రే తు పునర్వసౌ!

తస్య సర్వాణి సౌఖ్యాని

దీయతే రఘుసత్తమ||

శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున భద్రాచల శ్రీరామచంద్ర ప్రభుని పూజించిన సకల శుభములు ప్రాప్తిస్తాయి. ఆలయంలో స్వామివారి పాదప్రదక్షిణ చేయుటకు వీలుకాదు కనుక గిరిప్రదక్షినే సులభమార్గం కనుక అట్టి కార్యక్రమం పునర్వసు రోజు ప్రారంభిచాము. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనం మరియు తీర్ధప్రసాదములతోపాటు పాల్గొన్నవారికి అల్పాహారం కూడా అందించటం జరిగింది. దీనికి సహకరించిన ఈవో యల్. రమాదేవిగారికి ధన్యవాదములు తెలియజేసారు. ప్రతీ పునర్వసుకు నిర్వహిస్తున్న ఈకార్యక్రమంలో భక్తరామదాసు ట్రస్ట్ నిర్వాహకులు, భక్తరామదాసు పదవతరం వారసులైన కంచర్ల శ్రీనివాసరావు దంపతులు, ఆలయ టెంపుల్ ఇంచార్జి లింగాల సాయిబాబా, మరియు రామభక్తులు పాల్గొన్నారు.....🙏 జై శ్రీరామ్

16/08/2025

🚩శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏🏻

🚩భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానానికి ISO వారి గుర్తింపు లభించింది.19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి...
13/08/2025

🚩భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానానికి ISO వారి గుర్తింపు లభించింది.19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి మరియు 22000 ఆహార భద్రత నిర్వహణ స్థాయి పాటించే గుర్తింపు లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి శ్రీమతి ఎల్ రమాదేవి గారు అందుకున్నారు. ఈ సర్టిఫికెట్ను ISO డైరెక్టర్ శ్రీ శివయ్య గారు అందించారు.🙏🏻 జై శ్రీరామ్

Address

Bhadrachalam
507111

Telephone

+917893365659

Website

Alerts

Be the first to know and let us send you an email when భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం-భక్త సమాజం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం-భక్త సమాజం:

Share

Category