12/08/2026
ఇందిరమ్మ LIG టవర్స్ శంకుస్థాపన - పటిష్ట భద్రతా ఏర్పాట్లు! 🚨
కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి గారి డబుల్ బెడ్రూం ఇళ్ల (ఇందిరమ్మ LIG టవర్స్) ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్య విశేషాలు:
➡️భద్రతా సిబ్బంది: సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ బందోబస్తు.
➡️క్షేత్రస్థాయి పరిశీలన: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. యం. రమేష్, IPS, బుధవారం సభా ప్రాంగణాన్ని పరిశీలించి, బాంబ్ డిస్పోజల్ (బీడీ) బృందంతో తనిఖీలు నిర్వహించారు.
➡️ట్రాఫిక్ నియంత్రణ: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళిక, మళ్లింపులు మరియు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు.
సమన్వయ శాఖలు:
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
సభకు వచ్చే ప్రజలు మరియు వాహనదారులు అందరూ పోలీసులకు సహకరించాలని కోరడమైనది. 🙏