మన దేవాలయాలు మన వైభవం

మన దేవాలయాలు మన వైభవం మన దేవాలయాలు మన వైభవం పేజి Mana Temples వారిది..మన దేవాలయాలను అందరికీ తెలియచేయాలి అన్నది మా ఉద్యేశ్యం

యేటి గడ్డ శివాలయం,కర్నూల్--------------------------------------ఎంతో అరుదుగా కనిపించే విశేషమగు "శ్రీ చక్ర సహిత శివ లింగం"...
02/02/2026

యేటి గడ్డ శివాలయం,కర్నూల్
--------------------------------------

ఎంతో అరుదుగా కనిపించే విశేషమగు "శ్రీ చక్ర సహిత శివ లింగం" పరమ పావన తుంగభద్ర నది పరివాహం లో ఎన్నో అద్భుతమైన క్షేత్రాలకు నెలవు అలాంటి తుంగా తీరం లో కర్నూల్ నగరం లో "యేటి గడ్డ శివాలయం" గా పిలువబడుచున్నది .

ఈ దేవాలయం 2009 లో వచ్చిన వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఈ దేవాలయాన్ని ఇటీవల పునరుద్ధరణ చేశారు ఈ దేవాలయం లో గర్భాలయం లో మధ్యలో పైన శ్రీచక్ర సహిత శివలింగము , స్వామి కి ఎడమ వైపు భైరవ మూర్తి, కుడి వైపు నాగరాజు,ఎక్కడ లేని విధంగా ఆంజనేయుని మూర్తి శివుని కన్నా ఎత్తులో ఉంది ఇక్కడ అంబిక ,గణపతి ,కూడా దర్శనమిస్తారు.

"శ్రీ చక్ర సహితము గా శివలింగము ఉండడం ఎంతో విశేషం వీలున్న వారు తప్పక దర్శించుకోగలరు.

#కర్ణాటక రాష్ట్రంలో ని విజయపురా లో కొలువైన శ్రీ చక్ర సహిత సుందరేశ్వర స్వామి దేవాలయం.

చాలా అరుదైన క్షేత్రం.స్వామి వారు శ్రీచక్ర సహితంగా కొలువై ఉండడం..

#కాశీ లో కొలువైన శ్రీ చక్ర సహిత శివలింగం..

చాలా అరుదైన క్షేత్రం.స్వామి వారు శ్రీచక్ర సహితంగా కొలువై ఉండడం..

ప్రతి ఒక్కరూ తప్పకుండ షేర్ చేయండి

మీ శ్రేయోభిలాషి
గిరీష్

02/02/2026

సోమవారం శుభాకాంక్షలు..మహదేవుని కృపా కటాక్షాలు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ..

ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన మహదేవుని మంత్రం ..

 #మనదేవాలయాలు_మనసంపద #మనదేవాలయాలు #దయచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం క...
01/02/2026

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#దయచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి


ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం

FB Page;
Facebook.com/manatemples

గంగైకొండ ,చోళపురం తమిళనాడు రాష్ట్రంలోని ariyalur జిల్లాలోని ఒక చిన్న గ్రామం. చోళుల రాజధానిగా ఎంతో ఘనంగా వెలిగిన ప్రదేశం ఇది.

10 వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం ఎంతో అద్భుతమైన కట్టడాలు,నిర్మాణ శైలి ని కలిగి ఉంది.మహాదేవుడు కొలువైన దివ్యమైన ప్రదేశం. చోళుల కు 250 సంవత్సరాలు రాజధానిగా సేవాలందించింది.

Tiruchirapalli నుండి 125 కి మీ దూరం లో కొలువై ఉంది.

మీ శ్రేయోభిలాషి
గిరీష్

భావనారాయన స్వామి దేవాలయం,బాపట్ల---------------------------------------------------------ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. దా...
01/02/2026

భావనారాయన స్వామి దేవాలయం,బాపట్ల
---------------------------------------------------------
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ దేవాలయంలో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. ఇక ఈ దేవాలయంలో విగ్రహం మునికాళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. ఇటువంటి విగ్రహం భారత దేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న మరో మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇక మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు.

ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం పూర్తి వివరాలు మీ కోసం...

భావనారాయన స్వామి దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారత దేశంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాలు. వీటి నిర్మాణం దాదాపు 1500 ఏళ్లకు పూర్వం జరిగిందని తెలుస్తోంది.

భావనారాయణ స్వామి దేవాలయాలు మొత్తం ఐదు. ఇక్కడ నెలకొన్న భావనారాయణ స్వామి వల్ల ఈ ఊరిని మొదట భావపురి అని పిలిచేవారు.

అటు పై బావపట్ల కాలక్రమంలో భావపురిగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడితో పాటు పరివార దేవతలైన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవారు, ఆళ్వారులు ఉన్నారు.

ఇక్కడ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది. ఇలా ఓ దేవతా మూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించవు.

ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు గజపాద (ఏనుగు కాలు) ఉండటం విశేషం.

ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 594లో భావనారాయణుడి సూచనమేరకు చోళ రాజైన క్రిమికంఠ చోళుడు నిర్మించినట్లు చెబుతారు.

ఇతని తర్వాత చోళ భూపాల దేవుడు, వీర ప్రతాప శూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగ చోళదేవరాజు, గజపతులు, దేవరాయులు అటుపై అచ్చుత దేవరాయులు, సదాశివరాయులు ఈ ఆలయం అభివ`ద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.

ఇదిలాఉండగా భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం జరిగే సమయంలో పునాదుల కోసం తవ్వుతుండగ అక్కడి వారికి జ్వాలా నరసింహ స్వామి విగ్రహం దొరికింది. దీంతో ఆ విగ్రహన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించేవారు.
అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి. ఈ విషయమై క్రిమకంఠ చోళుడు అక్కడి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగారు

దీంతో పురోహితులు జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఆయన్ను శాంతింప చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు. ఇక జ్వాలా నరసింహుడి విగ్రహం ఆసీన రీతిలో ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి. పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.

ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం.

మీ శ్రేయోభిలాషి
Girish

 #రాకమచెర్ల #రాకమచెర్లవెంకటదాసులవారు #రాకమచెర్లయోగనందనరసింహాస్వామిదేవాలయం #వెంకటదాసులవారికీర్తనలు #రాకమచెర్లభజనకీర్తనలుర...
01/02/2026

#రాకమచెర్ల
#రాకమచెర్లవెంకటదాసులవారు
#రాకమచెర్లయోగనందనరసింహాస్వామిదేవాలయం
#వెంకటదాసులవారికీర్తనలు
#రాకమచెర్లభజనకీర్తనలు

రాకమచెర్ల వెంకట దాసుల వారు గొప్ప వాగ్దేయకారుడు.అన్నమాచార్యులు,రామదాసు అంత గొప్ప చరిత్రకారుడు,జ్ఞాని,భక్త సులబుడు.
తన జీవితమంతా హరినామ స్మరణతో జీవితం గడిపి ప్రజలలో దైవ చింతన,భక్తితో మేల్కొలుపే వాడు.

వెంకటదాసుల వారు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పుడూర్ మండలం లో గల రాకమచెర్ల గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని ఒక పీఠాన్ని స్థాపించి తన జీవితాన్ని దైవం లో లీనం చేశారు.చీమలు ఒక రాయిని యోగనంద నర్సింహుని గా మలిచాయి.కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దివ్య క్షేత్రమిది.

కొన్ని వేల కీర్తనలను అయిన రాసినారు.దాంట్లో కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి.దాసుల వారు నెలకొల్పిన పీఠానికి అధిపతులగా మా వంశస్థులు అనాదిగా ఉంటూ అయిన భక్తి పరంపర ను కొనసాగిస్తూ ప్రజలను ఆధ్యాత్మికం వైపు నడిపిస్తున్నారు!

ఇప్పటికి మా స్వగ్రామం లో ఉన్న తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు అయిన రాసిన కీర్తనలను భజన గా చేస్తూ స్వామి వారి సేవ కార్యక్రమలు నిర్వహిస్తారు.

ప్రతి ఒక్కరు ఇ క్షేత్రాలను దర్శించి స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు.

తెలంగాన సాంస్కృతిక శాఖ వాళ్ళు బాగా అధ్యయనం చేసి చరిత్ర మరిచిపోయిన గొప్ప వాగ్దేయకారుడిని ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేయాలి.

వేళ్ళు మార్గం:హైదరాబాద్ నుండి పరిగి, కొడంగల్,సెడం,యాదగిరి, గుల్బర్గా వెళ్లే బస్ లు రాకమచెర్ల సమీపం నుండి వెళుతాయి.

గమనిక; మిత్రులందరికీ విజ్ఞప్తి ప్రతి ఒక్కరు మంచి విషయాన్ని అందరితో పంచుకొని ఒక గొప్ప వాగ్గేయకారుడు గురుంచి ప్రపంచానికి తెలియ చేసే ప్రయత్నం చేద్దాం!

#పెద్దఉమ్మెంతల్
#తిరుమలనాథస్వామి
#గోవిందయ్యగారు




ఇట్లు మీ శ్రేయోభిలాషి
Girish

భావనారాయణ స్వామి ఆలయం,సర్పవరం---------------------------------------------------సర్పవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన భావనార...
31/01/2026

భావనారాయణ స్వామి ఆలయం,సర్పవరం
---------------------------------------------------

సర్పవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి ఆలయం కలదు. ఇది కాకినాడ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయంగా గుర్తించబడింది. దీని స్థలపురాణం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ప్రస్తావించబడింది. అగస్త్య ముని సర్పవరం గాధను సనకసనందనాదులకు వివరిస్తాడు.

పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉన్నది.

సర్పవరం పాతాళభైరవాలయంనకు ఒక విశిష్టత ఉన్నది. పూర్వము నారదుడు కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని ధరించాడని ... ఆతరువాత మరళా కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్నాడని చెబుతారు. నేటికీ ఆ కొలనులు దేవాలయం ప్రాంగణంలో పక్కపక్కనే చూడవచ్చు.

దేవాలయం గోపురం శిల్పకళాశోభితమై ఆహ్లాదకరంగా, ఆశ్చర్యకరంగా కానవస్తుంది. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ! సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం ప్రాశస్తి .. ఒకనాడు ఇంద్రాది దేవతలు బ్రహ్మతో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించి ప్రస్తావన వస్తుంది. ఆ మాయ తెలుసుకోవటం కష్టమని అందరూ గ్రహించారు. కానీ అక్కడే ఉన్న నారదుడు తనకు తెలుసుకోవడం సులభమని చెబుతాడు. ఇది తెలుసుకున్న విష్ణుమూర్తి అతనిని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు.

నారదుడు ఒకనాడు భూలోక విహారానికి వెళ్ళాడు. సంధ్యా సమయం కావడంతో నీటికొలనులో దిగి స్నానము చేయగా, అతను స్త్రీ రూపాన్ని ధరిస్తాడు. ఒడ్డున పెట్టిన వీణ, కమండలం కనిపించకుండాపోతాయి. శక్తులన్నీ నశిస్తాయి. ఏమిచేయాలో పాలుపోక భూలోకంలోనే ఉండిపోతాడు నారదుడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడును చూసిన పిఠాపురం నికుంఠ మహారాజు మోజుపడి వివాహం చేసుకుంటాడు. ఆతరువాత జరిగిన శత్రురాజుల యుద్ధాలలో అతను మరణిస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు అడవుల్లోకి పారిపోతాడు (ఒకేవేళ రాజ్యంలో ఉంటే శత్రురాజుల చేతిలో మరణమో లేదా బందీయో కావాలి కనుక). చాలా రోజులు అడవుల్లో ఇష్టమొచ్చినట్లు తిరుగుతాడు. ఆకలేసి చెట్టు కొమ్మపై ఉన్న ఒక ఫలాన్ని కోయటానికి ప్రయత్నిస్తూ, వ్యయప్రయాసలు పడుతుంటాడు. అప్పుడు అక్కడికి విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి, "నీవు కొలనులో స్నానం చేసి వస్తే గానీ పండు కోసి ఇవ్వను" అని చెబుతాడు

సరే అని కొలనులో వెళ్ళి స్నానం చేయగా, నారదరూపాన్ని ధరిస్తాడు నారదుడు. ఆశ్చర్యంగా ఒడ్డుకు వచ్చిన నారదుడు ఇదంతా విష్ణుమాయ అని గ్రహిస్తాడు. దాంతో శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం భావనారాయణ స్వామిని ప్రతిష్టించి, వందల ఏళ్ళు తపస్సు చేసాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై, కోరిక అడగగా ఇక్కడే కొలువుండమని చెబుతాడు నారదుడు. నారదుని కోరిక వలన భావనారాయణస్వామిగా విష్ణుమూర్తి ఇక్కడే వెలిశాడు. ఆతర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తి విగ్రహానికి ఎదురూగా ప్రతిష్టించారు.

దేవాలయం సందర్శన సమయం : ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.

మీ శ్రేయోభిలాషి
గిరీష్

శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం,వేణిసొంపుర్------------------------------------జోగులంబ జిల్లా, ఐజ మండలం  #వేణిసొంపుర్ గ్రా...
31/01/2026

శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం,వేణిసొంపుర్
------------------------------------
జోగులంబ జిల్లా, ఐజ మండలం #వేణిసొంపుర్ గ్రామంలో తుంగభద్ర నది తీరాన పురాతనమైన వేణుగోపాల స్వామి దేవాలయం కొలువై ఉంది.శతాబ్దాల క్రితం మంత్రాలయం #రాఘవేంద్రస్వామి శిస్యుడైన #భువనేంద్రతీర్థులు తుంగభద్ర నది తీరాన కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారు. నది తీరాన భువనేంద్ర స్వామి విశ్రాంతి తీసుకుంటుండగా స్వామి వారు కలలోకి వచ్చి వల్లూరు వద్ద త్రవ్వితే విగ్రహం లభిస్తుంది అని చెప్పి అంతర్ధనమయ్యారు.స్వామి వారి అదేశాలమేరకు త్రవ్వగా కుడి కాలు పైన ఎడమ కాలు వేసుకున్న విగ్రహం లభించగా దానినే వేణిసొంపుర్ లో ప్రతిష్టించారు.సంతానం లేని వారు స్వామి వారిని పూజిస్తే సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం..స్వామి వారిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తారు.
సాధారణంగా మనకు విగ్రహాలు ఎడమ కాలు పైన కుడి కాలు వేసుకుని కనబడతాయి.ఇక్కడ మాత్రం ప్రత్యేకం..స్వామి వారి చేతిలో వేణువు పట్టుకొని దర్శనం ఇస్తారు.

మీ శ్రేయోభిలాషి
గిరీష్

అల్లాడు పల్లె వీరభద్ర స్వామి క్షేత్రం--------------------------------------దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం న...
31/01/2026

అల్లాడు పల్లె వీరభద్ర స్వామి క్షేత్రం
--------------------------------------

దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె' ఒకటి. కడప జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోందని శాస్త్రంలో చెప్పబడుతోంది. సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణాలతో శిల్పకళతో ఈ ఆలయం కనిపిస్తుంటుంది.

వందల సంవత్సారాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. వీరభద్ర స్వామి వారి మూర్తి పెరుగుతుందమే అందుకు నిదర్శమని చెప్పబడుతోంది. ప్రతిష్ట నాటికి, ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి.

అందువలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ వీరభద్ర స్వామివారిని ఆరాధించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని, మనస్సులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు.

30/01/2026

రేపు శనివారం ,త్రయోదశి తిథి (శని త్రయోదశి)..అందరూ తప్పకుండా వీలైతే శనేశ్వరునికి తిల,తైలాభిషేకం,మహాదేవునికి అభిషేకం చేయడం,హనుమ దర్శనం వలన ఎంతో మేలు కలుగుతుంది!!

రాజ  రాజేశ్వర స్వామి దేవాలయం -వేములవాడ------------------------------------------------కరీంనగర్ పట్టణానికి 35 కి మీ దూరం ...
30/01/2026

రాజ రాజేశ్వర స్వామి దేవాలయం -వేములవాడ
------------------------------------------------
కరీంనగర్ పట్టణానికి 35 కి మీ దూరం లో ఉన్న వేములవాడ పట్టణం లో వెలసిన రాజ రాజేశ్వర స్వామి దేవాలయం చాళుక్యుల కాలం నాటిది . వేయి సంవత్సరాల చరిత్ర గల ఈ దేవలయం.

శ్రీశైల శికారం దర్శనం చూడడం వాళ్ళ ముక్తి కలుగుతుంది అని ,కాశి లో మరణిస్తే మోక్షం లబిస్తుంది అని ఇతర క్షేత్రాలలో తపస్సు చేస్తే మోక్షం కలుగుతుంది అని పురాణగాథలు కానీ, ధర్మగుండం పేరు వింటేనే మోక్షం కలుగుతుంది అని ప్రతిక .

స్థలపురాణం
-------------
అర్జనుడి మనవడు అయన నరేంద్రుడు పొరపాటున లేడి అనుకోని ఒక ఋషిని చంపాడట . అతనికి కలిగిన పాపం ఎన్ని పూజలు చేసిన పోలేదు . ఆలా తిరుగుతూ దప్పికాయ ధర్మగుండం లో దీగి స్నానం చేసి దోసిట తో నీరు త్రాగాగానే పాపపరిహారం పొందాడు అని, స్వామి అతనికిస్వప్నం లో కనిపించి ధర్మగుండం అడుగున రాజేశ్వర రూపం లో తను ఉన్నని అని దానిని తీసి ప్రతిష్టించాలని ఆనతిచ్చాడు . నరేంద్రుడు అలాగే ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం . ఈ స్వామి ని త్రేతా యుగం లో రాములవారు ,ద్వాపర యుగం లో పండువాలు అర్చించారని మారో గాథ చెబుతుంది .

శ్రీ రాజ రాజేశ్వర స్వామి నీలలోహిత లింగాకార రూపం లో వేలియగా , అమ్మ వారు ,నందీశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు .

ఈ ఆలయం లో 22 శివలింగాలు ఉన్నాయి . కోదండ రామాలయం , కాశి విశ్వేశ్వర ఆలయం ,మహిససురమర్ధిని ఆలయం చూడదగినవి . ఇక్కాడ ఉన్న శ్రీ రాజ రాజేశ్వర స్వామి ని రాజన్న అని కూడా పిలుస్తారు . శ్రీ రాజ రాజేశ్వర దేవాలయంతో పాటు అనంత పద్మనాభ స్వామి దేవాలయం, శ్రీ రామ చంద్ర స్వామి దేవాలయాలు కూడా కొలువై ఉన్నాయి .






మీ శ్రేయోభిలాషి
గిరీష్

రామలింగేశ్వర స్వామి ఆలయం గురుజాల-----------------------------------------------కర్నూల్  జిల్లా  నందవరం మండల కేంద్రానికి ...
30/01/2026

రామలింగేశ్వర స్వామి ఆలయం గురుజాల
-----------------------------------------------

కర్నూల్ జిల్లా నందవరం మండల కేంద్రానికి 5 కి మీ దూరం లో గురుజాల గ్రామం లో తుంగ భద్రా నది తీరాన కొలువైన రామలింగేశ్వర స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్రగల దేవాలయం ...అందమైన తుంగ భద్రా నది తీరాన ప్రశాంత వాతావరణం లో కొలువైన ఈ దేవాలయం ప్రతి నిత్యం విశేషమైన పూజాలంధుకుంటుంది .
రామ రావణ యుద్దనానంతరం రాముడు తిరిగి వస్తు ఈ ప్రాంతానిలో బ్రహ్మ హత్య దోష నివారణకు శివలింగాన్ని ప్రతిస్టించాలని అనుకుంటారట ..హనుమాన్ ని కాశి క్షేత్రానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకొని రమ్మని చెప్పగా హనుమ బయలుదేరుతడట..కానీ సమయానికి హనుమ రావడం ఆలస్యం అవ్వడం తో రాముల వారు నది తీరాన ఉన్న ఊసకతో శివలింగాన్ని చేసి పూజలు చేశారు ఆట..కొంత సమయం పిమ్మట హనుమ కాశి క్షేత్రం నుంచి లింగాన్ని తీసుకొని ఈ ప్రదేశాన్ని చేరుకుంటారట...కానీ అప్పటికే రాముడు లింగాన్ని ప్రతిస్టించగ..ఆంజనేయుడు కూడా తను తెచ్చిన విగ్రన్ని ప్రత్స్టించమని కోరగా రాముల వారు ఆ విగ్రహాన్ని కూడా ప్రతిస్టించి హనుమాకు అభయమిచ్చాడట
యెవరైతా ముందు కాశి విశ్వేసవర లింగాన్ని దర్శించుకున్న తరువాత నేను ప్రతిస్టించిన లింగాన్ని దర్శిస్తారో వారికి మోక్షం లబిస్తుంది అని చెప్పగా హనుమా సంతోశించడట ..అలా ఈ క్షేత్రం లో ఇసుక లింగం రామలింగేశ్వ్ర స్వామి గా హనుమ తెచ్చిన లింగం కాశీ విశ్వేశ్వర లింగముగా ప్రసిద్ది కెక్కిందాట.
స్వామి వారికి ప్రతి నిత్యం విశేశమైన పూజలతో పాటు కార్తీక మాసం,శ్రావణ మాసం లో విశేసంగా భక్తుల వచ్చి నది స్నానం ఆచారించి స్వామి వారిని దర్శించుకుంటారు ..మాఘ మాసం లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుయాయి .

మీ శ్రేయోభిలాషి
గిరీష్

ప్రతి శనివారం మా గ్రామ ఆంజనేయ క్షేత్రం లో (పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం,పూడూరు మండలం,వికారాబాద్ జిల్లా)ఉదయం ఆంజనేయ స్వామికి ప...
30/01/2026

ప్రతి శనివారం మా గ్రామ ఆంజనేయ క్షేత్రం లో (పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం,పూడూరు మండలం,వికారాబాద్ జిల్లా)

ఉదయం

ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, తమలపాకుల పూజ,సింధూర అభిషేకం,వడమాల పూజ నిర్వహించడం జరుగుతుంది.

సాయంత్రం

హనుమాన్ చాలీసా పారాయణం ,ఉయ్యాలసేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.



Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when మన దేవాలయాలు మన వైభవం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మన దేవాలయాలు మన వైభవం:

Share