Team of Research On Culture and Heritage

Team of Research On Culture and Heritage This page gives you the complete information about Telangana state and its Tourism...
Stay tuned to our page for latest and intresting updates...

Telangana Tourism bringing you the best of Telangana Tourist attractions, Kuntala waterfalls, Gayatri, Kanakai, tourist attractions of all the 10 districts of Telangana
email tous if you come across any new tourist attraction/best location in Telangana.

వన సీమలో జనజాతర - నూర శ్రీనివాస్
25/01/2026

వన సీమలో జనజాతర - నూర శ్రీనివాస్

కోటగుళ్లలో కాకతీయుల కాలపు కుడ్యచిత్రాల సంరక్షణకు TORCH విజ్ఞప్తి భూపాలపల్లి  జిల్లాలోని ఘన్‌పూర్‌లోని కోటగుళ్ల ఆలయంలో ఉన...
25/01/2026

కోటగుళ్లలో కాకతీయుల కాలపు కుడ్యచిత్రాల సంరక్షణకు TORCH విజ్ఞప్తి

భూపాలపల్లి జిల్లాలోని ఘన్‌పూర్‌లోని కోటగుళ్ల ఆలయంలో ఉన్న కాకతీయుల కాలపు (సుమారు 800 ఏళ్ల నాటి) అరుదైన కుడ్యచిత్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఆలయ రాతి దూలాలు, పైకప్పు పలకలపై సహజ రంగులతో చిత్రించిన నర్తకులు, కిన్నెరలు, హంసలు వంటి దృశ్యాలు నేటికీ కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయితే కాలక్రమంలో వాతావరణ ప్రభావాలు, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల ఈ చిత్రాలు మసకబారుతున్నాయి.

ఈ నేపథ్యంలో TORCH (Team of Research on Culture & Heritage) కార్యదర్శి, చరిత్రకారుడు అరవింద్ ఆర్య ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. కోటగుళ్లలోని కాకతీయ కాలపు కుడ్యచిత్రాలను శాస్త్రీయ పద్ధతుల్లో పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురావస్తు శాఖను కోరారు.
కాకతీయుల పాలనా కాలం తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, వారి వారసత్వానికి ఈ కుడ్యచిత్రాలు కీలక ఆధారాలని అరవింద్ ఆర్య తెలిపారు. శిల్పకళతో పాటు చిత్రలేఖనంలో కూడా కాకతీయులు ఎంత నిష్ఠాతులో ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన పరిరక్షణ లేక ఇప్పటికే 90% చిత్రాలు పాడయ్యాయని , వీటిని తక్షణం కాపాడాల్సిన అవసరం ఉందని ఈ విషయమై పురావస్తు శాఖ డైరెక్టర్‌కు లేఖ ద్వారా వినతి చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కోటగుళ్లలోని ఈ అమూల్యమైన కుడ్యచిత్రాలను కాపాడితే, భవిష్యత్ తరాలకు కాకతీయుల కళా వైభవాన్ని అందించినట్లవుతుందని అన్నారు .

ఆ ఊరు కాకతీయులదే- మామునూరు గ్రామ విశిష్టతపై కథనం.
19/01/2026

ఆ ఊరు కాకతీయులదే- మామునూరు గ్రామ విశిష్టతపై కథనం.

తెలంగాణలో ఇనుపయుగంలో గుర్రపు స్వారీ
10/01/2026

తెలంగాణలో ఇనుపయుగంలో గుర్రపు స్వారీ

పర్యాటక ప్రాంతాల్లో గైడ్ ల కొరత
10/01/2026

పర్యాటక ప్రాంతాల్లో గైడ్ ల కొరత

Migratory birds give beautiful lakes a flyby
10/01/2026

Migratory birds give beautiful lakes a flyby

ఒగ్గు పదం - డోలు పాదం గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శన.
10/01/2026

ఒగ్గు పదం - డోలు పాదం
గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శన.

అరుదైన కేన్ పరిరక్షణలో అలసత్వం.
10/01/2026

అరుదైన కేన్ పరిరక్షణలో అలసత్వం.

అగ్గలయ్య గుట్టపై అగ్గి - పచ్చదనం బుగ్గి.
10/01/2026

అగ్గలయ్య గుట్టపై అగ్గి - పచ్చదనం బుగ్గి.

చారిత్రక వరంగల్ కోట (Warangal Fort) ఆక్రమణల చెరలో చిక్కుకుంది. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ కోట పరిధిలోని భూములు...
10/01/2026

చారిత్రక వరంగల్ కోట (Warangal Fort) ఆక్రమణల చెరలో చిక్కుకుంది. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ కోట పరిధిలోని భూములు అన్యాక్రాంతమవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆక్రమణల పర్వం..
వరంగల్ కోట చుట్టూ ఉన్న చారిత్రక మట్టి గోడలు, రాతి కట్టడాలను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. పురావస్తు శాఖ (ASI) ఆధీనంలో ఉండాల్సిన ఈ భూముల్లో యథేచ్ఛగా ఇళ్లు, వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నాయి. దీనివల్ల కోట ఉనికికే ప్రమాదం వాటిల్లుతోందని చరిత్రకారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ రికార్డుల్లో లోపాలు..
వాస్తవానికి ఈ భూములు భారత పురావస్తు శాఖ (ASI) పరిధిలోకి వస్తాయి. కానీ, రెవెన్యూ రికార్డుల్లో ఇవి ఇంకా రాష్ట్ర ప్రభుత్వ భూములుగానే నమోదై ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవడంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కబ్జాదారులు చెలరేగిపోతున్నారు.

అధికారుల తీరుపై విమర్శలు..

గతంలోనూ ASI అధికారులు స్థానిక యంత్రాంగానికి, కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణలు ఆగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా లేఖతోనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వరంగల్ ఖిల్లాను రక్షిస్తుందో లేదో వేచి చూడాలి.

Address

Warangal, Telangana
Hyderabad
506002

Telephone

+917997270270

Website

Alerts

Be the first to know and let us send you an email when Team of Research On Culture and Heritage posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Team of Research On Culture and Heritage:

Share