Devuni Kadapa

Devuni Kadapa Hi All Peoples this is Devuni kadapa face book Page for daily updats

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యేషదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శ...
06/01/2015

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే
షదాననం చందన లేపితాంగం
మహారసం దివ్య మయూర వాహనం
రుదస్య నూనుం సురలోకనాథం
శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే

ఆరు ముఖములను, పన్నెండు చేతులను కలిగి నెమలి వాహనారూఢుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివపార్వతుల గారాల బిడ్డ దేవ సేనల ప్రభువు కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి సమృద్ధిని ప్రసాదించే భక్తసులభుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు జన్మించిన పవిత్ర పర్వదినం 'శ్రీ సుబ్రహ్మణ్య షష్టి'. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమారషష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుక...

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసులను హింసిస్తూ ఉండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అందుకు ''శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని పరిణయమాడునట్టు చేస్తే వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు'' అని ఉపాయం చెప్పాడు. ఈ మాటలను విన్న దేవతలు, శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మథుడిని పంపగా శివుడు తన మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని దహించి వేశాడు. అయితే తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది.

అగ్నిదానిని భరించలేక గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణమునకు తోసివేసింది. అక్కడే శ్రీకుమారస్వామి జన్మించాడు. శరవణమున జన్మించిన వాడు కనుక స్వామికి 'శరవనబహ్వుడు' అనే పేరు ఏర్పడింది. అంతేకాకుండా గంగానదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది. ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు, పన్నెండు చేతులు, రెండు కాళ్ళతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అందువల్ల ఆయనకు 'షణ్ముఖుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరు కృత్తికలను నియమించారు. వారు పెంచి పెద్ద చేశారు. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి 'కార్తికేయుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు కథనం.

బ్రహ్మనే బంధించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి !
త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి కుమారుడిగా జన్మించి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు నియమించిన కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోని బందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దానిని విన ఆకళింపు చేసుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవమంత్రార్థాన్ని చెప్పాల్సిందిగా అడిగాడు. బ్రహ్మ సరిగ్గా చెప్పకపోవడంతో సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మదేవుడుని బంధించాడు. శివుడు జోక్యం చేసుకుని విడిపించాడు.

నెమలి వాహనం,కోడి ధ్వజం...
తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో....నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటున్నట్లు పురాణ కథనం.

వల్లీ...దేవసేనలు.....
శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఇద్దరు దేవేరులున్నారు. శ్రీవల్లీదేవి, శ్రీదేవ సేనలు. వారు తారకాసురుడిని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేయగా, తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనం.

కావడి మొక్కులంటే ఇష్టం.......
పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటిరోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసంను విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయని చెప్పబడుతూ ఉంది.

బ్రహ్మచారికి పూజ
సుబ్రహ్మణ్యషష్టినాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, పంచలసాపు,దక్షిణలను తాంబూలమందు ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.

వీటికి తోడు ఈరోజు "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్యషష్టి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి.

05/01/2015
శివలింగాన్ని తెల్లని అన్నంతో నిర్మించి పూజలు చేస్తే ఎన్నోలాభాలు...ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజల చేస...
05/01/2015

శివలింగాన్ని తెల్లని అన్నంతో నిర్మించి పూజలు చేస్తే ఎన్నోలాభాలు...
ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజల చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలు తలతూగుతాయట. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారట. అలాగే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయని, తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెపుతున్నారు. అయితే, ఆయా వారానికి అనుగుణంగా పూజలు చేయాలని కోరారు.
ఉష్ణ సంబంధిత వ్యాధులు ఉంటే ఆదివారం చేయాలని, శీత సంబంధిత వ్యాధులు ఉంటే సోమవారం చేయాలన్నారు. అలాగే, రక్తానికి, రక్తపోటుకు సంబంధించిన వ్యాధులు ఉంటే మంగళవారం చేయాలి. బుద్ధికి, నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటే బుధవారం చేయాలి. అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులు ఉంటే గురువారం చేయాలని కోరుతున్నారు. మూత్రకోశ రోగాలు, మూత్రపిండాల సమస్య, డయాలసిస్‌, మూత్ర పిండాల్లో రాళ్లు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయాలి. ఎముకల సమస్యలు, వెన్నునొప్పి, నడుంనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయాలని సూచన చేస్తున్నారు.
మనస్సుకు, చిత్తానికి శాంతి కలిగించేందుకు, శాంతి లభించేందుకు బుధవారం రోజు చేయాలి. మంచి జ్ఞాపకశక్తి పొందేందుకు పుణ్యక్షేత్రాల్లో దర్శనం ముక్తి పొందేందుకు శనివారం రోజు చేయండి. చాలా మంచి జరుగుతుందట. తెల్ల అన్నం, శెనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయన్నారు.
తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీశనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయన్నారు. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుందని ఆధ్యాత్మిక నిపుణులు అభిప్రాయాలు తెలిపారు.

యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రత...
05/01/2015

యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.
అగస్త్య పుష్కరిణి
The Pushkarini is suitable for holy baths.
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం వున్నది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వున్నది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, వున్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా వున్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలగ్నానం లో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు.
భక్తులను ఉద్ధరించడం కోసం శివపార్వతులు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. ఈ నేపథ్యంలో ఒక్కో క్షేత్రంలో వాళ్లు కొలువైన తీరు వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం దాగి వుంటుంది. ఆశ్చర్యచకితులను చేసే అలాంటి పురాణపరమైన కథనం ఒకటి 'యాగంటి' లో వినిపిస్తుంది. విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రం కర్నూలు జిల్లా పరిధిలో దర్శనమిస్తుంది.
ఒకప్పుడు తన పర్యటనలో భాగంగా ఈ ప్రదేశానికి చేరుకున్న అగస్త్యమహర్షి, ఇక్కడి స్థల మహాత్మ్యాన్ని గుర్తిస్తాడు. ఇక్కడి ప్రశాంతత ... ఆహ్లాదకరమైన వాతావరణం ఆయనను మంత్రముగ్ధుడిని చేస్తాయి. దాంతో పవిత్రమైన ఈ ప్రదేశంలో విష్ణుమూర్తిని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా సుందరమైనటువంటి విష్ణుమూర్తి ప్రతిమను సిద్ధం చేస్తాడు. అయితే ఆ విగ్రహం చిటికెన వ్రేలు దగ్గర దెబ్బతింటుంది.
విష్ణుమూర్తి విగ్రహం భిన్నం కావడం అగస్త్యమహర్షి మనసుకి కష్టం కలిగిస్తుంది. జరిగిన దానికి కారణమేమిటో తెలుసుకోవడం కోసం ఆయన శివపార్వతులను గురించి తపస్సు చేస్తాడు. శివపార్వతులు ప్రత్యక్షం కావడంతో, తాను ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహం దెబ్బతినడానికీ .. తాను తలపెట్టిన కార్యానికి భంగం కలగడానికి కారణమేమిటని అడుగుతాడు. గంగాదేవి నెలకొని వున్న ఈ ప్రదేశం తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రమనీ, అందువలన ఇక్కడ శివాలయం నిర్మించడం మాత్రమే సాధ్యమవుతుందని ఆదిదంపతులు చెబుతారు.
విషయం తెలుసుకున్న అగస్త్యుడు, ఏకశిలా మూర్తులుగా ఆ ప్రదేశంలో ఆవిర్భవించమని శివపార్వతులను కోరతాడు. ఆయన అభ్యర్థనను శివపార్వతులు అంగీకరించగా, వాళ్లను వదిలి ఉండలేని నందీశ్వరుడు కూడా ఇక్కడ స్వయంభువుగా కొలువుదీరతాడు. అలా ఆవిర్భవించిన బసవన్న అంతకంతకూ పెరుగుతూ వుండటం ఇక్కడి విశేషం. శివపార్వతులతో పాటు నందీశ్వరుడు స్వయంభువుగా ఆవిర్భవించిన మహిమాన్వితమైన ఈ క్షేత్రం, దర్శనమాత్రం చేతనే ధన్యులను చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' ...
04/01/2015

షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు.
నెమలి వాహనంతో కుమారస్వామి ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.

జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారి గా వుండి పోయాడట.

సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి

షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు

దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడంటారు.
షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు.

Telugu Lyrics Of Venkateswara Sthothramకమలాకుచచూచుక కుంకుమతోనియతారుణితాతుల నీలతనోకమలాయతలోచన లోకపతేవిజయీభవ వెంకటశైలపతేసచత...
03/01/2015

Telugu Lyrics Of Venkateswara Sthothram
కమలాకుచచూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వెంకటశైలపతే
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవతమౌళిమణే
శరణాగతవత్సల సారనిదే
పరిపాలయ మాం వృషశైలపతే
అతివేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే
అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధికదానరతాత్
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే
కలవేణురవావశగోపవధూ
శతకోతివృతాత్స్మరకోటిసమాత్
ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే
అభిరామగుణాకర దాసరథే
జగదేకధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రామేశ విభో
వరదో భవ దేవ దయాజలధే
అవనీతనయాకమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహమ్
రజనీచరరాజతమోమిహిరం
మహనీయమహం రఘురామమయే
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమమోఘశరమ్
అపహాయ రఘూద్వహ మన్య మహం
న కథంచన కంచన జాతు భజే
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ
అహం దురతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ
అజ్ఞానినా మయా దోషా
నశేషాన్విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైలశిఖామణే....

Address

Temple Street
Kadapa
516002

Telephone

7386152307

Website

Alerts

Be the first to know and let us send you an email when Devuni Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share