Vastu

Vastu Hello there, My name is Maheshwara Raju, Vastu consultant. I have experience over 10 years in Vastu Shastram. I have clients from various states in India.

Majority of my clients are having rice mills, traders, shops, broker shops. Most of my clients are happy with our Vastu pooja remedies. My clients take Vastu suggestions on new constructing types. eMail id: [email protected]
phone: 9701397395

14/11/2024

ఆయము లేని ఇంట్లో అరఘడియ కూడ ఉండరాదు, అచ్చొచ్చిన స్థలం ఒక్క అడుగు ఉన్న చాలు.

28/02/2018

ప్రతిఒక్కరు తమ జీవిత కాలంలో తమ శక్తికి తగ్గట్లు స్వంతముగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశతో ఉంటారు.ఇల్లు కట్టుకున్న తరువాత అందులో నివసించేవారు అన్నిరకాలుగా సుఖంగా బ్రతకాలని అనుకుంటారు.కానీ కట్టే ఇల్లు వాస్తు ప్రకారము కాకుండా విరుద్దంగా ఉంటే అందులో ఉండే వారికి ఫలితాలు కూడా విరుధ్ధగా ఉంటాయి

26/02/2018

వాస్తు అంటే ఏమిటి?

అన్ని ప్రాణులకు నివాసయోగ్యమైనది భూమి. భూమి పైన నిర్మించే నిర్మాణాలు వాస్తువులు. వాస్తువుల గురించి తెలిపే శాస్త్రమే వాస్తు శాస్త్రము. అయితే మనము నిర్మించే గృహము మంచి లక్షణాలు కలిగి ఉంటే మంచి ఫలితాలు, చెడు లక్షణాలు ఉంటే చెడు ఫలితాలు కలుగుతాయి.
ధనవంతుడు అయినా, మధ్య తరగతి వాడు అయినా, పేదవాడు అయినా ఎవరైనా కానీ తమ జీవిత కాలంలో తమ శక్తికి తగినట్లు స్వంతముగా ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఒక ధృఢమైన ఆశయం కలిగి ఉంటారు. ఇల్లు కట్టుకున్న తరువాత అందులో నివసించేవారు అందరు సతీసుతులతోను, ధన ధాన్యములతో సుఖంగా బ్రతకాలని అనుకుంటారు. కానీ మనము కట్టే ఇంటి యొక్క నిర్మాణము వాస్తు ప్రకారము కాకుండా విరుద్దంగా నిర్మించితే అందులో నివసించే వారికి ఫలితములు కూడా విరుద్దంగానే ఉంటాయి.
కాబట్టి మనము నిర్మించే ఇంటిలో అన్ని రకములుగా సంతోషముగా బ్రతకాలంటే సరిఅయిన వాస్తుశాస్త్రవేత్త వద్దకు వెళ్లి ఆయన సలహా ప్రకారం ఇంటిని నిర్మించుకున్నట్లైతే అప్పుడు నివాసించేవారే కాకుండా తరతరములు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుఖ జీవనం గడుపుతారు అని చెప్పడములో ఎటువంటి సందేహము అవసరము లేదు.
ప్రస్తుత కాలములో చాలామంది వాస్తు శాస్త్రము ఒక మూఢ నమ్మకముగా కొట్టిపారేస్తున్నారు. ఇల్లు కానీ, ఫ్యాక్టరీ కానీ, మరే ఇతర నివాస యోగ్యమైన ప్రదేశాలు కానీ వాస్తుకు విరుద్ధముగ నిర్మించినట్లయితే అనేకమైన దుష్ఫలితములు పొందవలసి ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంటిలోని వారు కోటీశ్వరులు అవుతారని కాదు కానీ ఉన్నంతలో సుఖ సంతోషాలతో జీవిస్తారు.

01/07/2017

వాస్తు పురుష జననం
వాస్తు పురుషుని జననం గురించి మొదట తెలుసుకుందాం.
పూర్వము బ్రహ్మాండమును సృష్టించునపుడు చాలా పెద్ద, అన్ని లోకములకు భయాన్ని కలుగచేయునట్టి ఒక భూతము పుట్టెను. ఆ భూతమును చూసిన ఇంద్రుడు మొదలగు దేవతలందరు చాలా భయపడి బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి తమ భయమును, బాధను ఇలా తెలియచేసిరి. ఓయీ బ్రహ్మదేవా సకల లోకములకు అధినాయకుడవైన ఓ ప్రభూ! మమ్మల్ని రక్షింపుము. సకల లోకములను భయము కలుగజేయు మరియు మింగివేయునట్టి ఒక భయంకరమైన భూతము పుట్టినది. దానిని చూచిన దేవతలందరును చాలా భయపడుతున్నారు. కావున ఓ బ్రహ్మదేవా నీవు మమ్మల్ని ఆ భూతము నుండి రక్షింపవలసిందిగా కోరుచున్నాము అని ప్రార్థింపగా, అది విన్న బ్రహ్మ దేవుడు ఓ దేవోత్తములారా మీరు భయపడకండి. దానితో మీకు ఎటువంటి భయము లేదు, అందరు కలసి ఆ భూతమును క్రింద పడవేయండి, అని చెప్పగా దేవతలందరు ధైర్యముతో దాని వద్దకు వెళ్లి, భూతమును పట్టి క్రింద పడవేసి అందరు దాని పైననే కూర్చుండిరి.
అప్పుడు బ్రహ్మదేవుడు ఆ భూతమునే వాస్తు పురుషునిగా సృష్టించెను. వాస్తు పురుషుడు భాద్రపద మాసము, బహుళ తృతీయ శనివారంనాడు పుట్టెను.
అలా వాస్తు పురుషుడు జన్మించిన కొంత కాలమునకు బ్రహ్మ దేవుని వద్దకు వచ్చి, ఓ బ్రహ్మ దేవా దేవతలందరు నన్ను అన్యాయముగా బాధించుచుండెదరు. కావున నా బాధ తీర్చుమని సవినయంబుగా ప్రార్థింపగా, అది విన్న బ్రహ్మదేవుడు అతనికి వరము ఇవ్వదలచి ఆ భూతముతో ఇలా పలికెను. ఓ వాస్తు పురుషుడా నిన్ను పూజింపని వాళ్ళు నీకు ఆహారము అగుదురని చెప్పెను. కావున నూతన గృహనిర్మాణ ప్రారంభ సమయమున, గృహ ప్రవేశమునను వాస్తుపురుషుని తప్పకుండ పూజించవలెను. అలా పూజ చేయని వారికి తాము చేయు పనులయందు అనేక ఆటంకములు కలుగుతాయి. అనేక ఇబ్బందులకు గురి కావలసివచ్చును.

కావున వాస్తు పురుష పూజ సకలమైన వారికినీ ఉత్తమోత్తము మరియు ఐశ్వర్యప్రదము .

15/06/2017

గృహస్థుడు నూతన గృహ నిర్మాణము ప్రారంభము చేయునపుడు తెలుసుకొనవలసిన ముఖ్య విషయాలు

అన్ని రకముల జీవ రాశులకు నివాస యోగ్యమైనది భూమి. దీనియందు నిర్మించబడినవి వాస్తువులు. వాటి గురించి తెలుపు శాస్త్రమే వాస్తు. మనము గృహమును నిర్మించడానికి తీసుకొనే స్థలము బాగా పరీక్షించి తీసికొనవలెను. పుట్టలు కలిగి ఉన్నది, బొగ్గులు, శల్యములు కలిగి ఉన్నది, ఇసుక ప్రదేశము, నాలుగు మూలలూ సరిగా లేనిది అనగా మూలలు పెరిగినది లేదా తగ్గినది, ఉత్తరము, తూర్పు, ఈశాన్యము కాకుండా మిగిలిన దిక్కులు పల్లము కలిగినది ఇటువంటి స్థలములు గృహ నిర్మాణమునకు పనికిరావు.
కావున ఇటువంటి లక్షణాలు లేని భూమిని ఎంచుకొని మనము గృహ నిర్మాను ప్రారంభించినచో ఎటువంటి కీడు జరుగకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఇలా స్థలమును ఎంచుకున్న తరువాత ఒక మంచి వాస్తుశాస్త్రవేత్త వద్దకు వెళ్ళి అతని సలహా మేరకు గృహ నిర్మాణము ప్రారంభించి సత్ఫలితములు పొందవలసినదిగా నా మనవి.

04/11/2016

గృహస్థుడు గృహ నిర్మాణం చేయునపుడు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా గృహనిర్మాణం యొక్క ఫలితాలు ఆ ఇంటి యజమాని కాకుండా ఇంటిలోని వారు అందరు అనుభవిస్తారు. కాబట్టి ఒక వ్యక్తి నూతన గృహ నిర్మాణం చేయాలని అనుకున్నపుడు అతడు ఒక ఇంజనీర్ని కలవడమో, లేక తానే సొంతముగా తనకి తెలిసిన విధంగా ఒక ప్లాన్ వేసి గృహ నిర్మాణము ప్రారంభించడము జరుగుతుంది. ప్రస్తుతము వాస్తుకి సంబంధించిన అనేక పుస్తకములు లభిస్తున్నాయి. కొందరు వాటిని చదివి వారికి ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలను ప్రారంభించడం జరుగుతోంది. ఈశాన్యము పెంచితే మంచిది అని ఫలానా గ్రంధములో ఉన్నది కావున ఈశాన్యము పెంచాలని తమకు ఇష్టము వచ్చినట్లు పెంచితే దాని యొక్క సత్పలితాలను మనము అనుభవించలేము. కారణం ఈశాన్యం పెంచాలి కానీ, ఇష్టము వచ్చినట్లు అనగా కావాలనే కొన్ని అడుగులు పెంచడము లేదా, ఈశాన్యం పెరిగినట్లు చేసుకోవడానికి అక్కడ నిర్మాణము చేపట్టడము చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.
కాబట్టి గృహము నిర్మించేటపుడు ఒక వాస్తుశాస్త్రవేత్తను సంప్రదించడము మంచిపద్దతి. మనము నిర్మించే ఇల్లు శాస్త్ర ప్రకారము ఇల్లు నిర్మిస్తే వారు కోటీశ్వరులు అవుతారని, ఆ ఇంటి యజమాని ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని నేను చెప్పను. కానీ శాస్త్రప్రకారం నిర్మించకుండా, విరుద్దంగా నిర్మిస్తే మాత్రం ఎంత గొప్ప వారు ఐన ఇబ్బందులు పడక తప్పదు అనేది మాత్రం వాస్తవం. శాస్త్ర ప్రకారం ఇల్లు నిర్మిస్తే తప్పకుండా అన్ని విషయాలలో అంటే మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇతరులకంటే మంచి స్థితిలో ఉంటారు అనేది ఎవరు కాదనలేని వాస్తవం.

22/09/2016

అద్దె ఇంటికి వాస్తు

కొంతమంది అద్దె ఇంటికి వాస్తు ఎందుకులే అని అనుకుంటారు కానీ సొంత ఇంటికి ఒకరకమైన వాస్తు, అద్దె ఇంటికి ఒకరకమైన వాస్తు అని ఉండదు. నివసించే గృహము దోష పూరితము, సరిగా లేనపుడు ఏ ఇల్లు ఐన ఒకటే ఫలితము అనుభవించ వలసివస్తుంది. అద్దె ఇంటిలో ఉన్న వారికీ ఆ ఇంటి యొక్క ఫలితము ఇంటి యజమాని (OWNER) అనుభవిస్తాడు కానీ అద్దెకు ఉన్నవారికి దుష్ప్రభావాలు ఉండవని భావిస్తుంటారు. కానీ దుష్ప్రభావాలు అద్దెకు ఉన్నవారే అనుభవించాలి. ఎలా అంటే మనకు సొంతంగా కారు లేనపుడు అద్దె కారు తీసుకొని ఎక్కడికైనా వెళతాము అనుకోండి. అలా వెళ్ళేటపుడు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే అప్పటికి అందులో ఉన్న వాళ్ళు ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది కానీ, దాని యొక్క యజమాని గురికాడు కదా.
కాబట్టి మనము నివసించే గృహము సొంత గృహము ఐన అద్దె గృహము ఐన ఏవైనా దోషాలు ఉంటె దుష్ఫలితాలు తప్పకుండా పొందుతారు.అద్దె ఇంటికి మనము రిపేరు చేయలేము కానీ, చిన్న చిన్నవాస్తు సవరణలు చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఒకవేళ సవరణలు చేసుకోలేని విధంగా ఉంటె దోషము పరిహారము అయ్యే విధంగా వాస్తు సిద్ధాంతి ని సంప్రదిస్తే మంచిది.

03/10/2015

దేవుడి గది నిర్మాణము
హిందువుల ఇళ్ళలో దేవుడి గదికి ఉన్న ప్రాశస్తం దేనికి లేదు. అయితే వారి వారి ఆర్ధిక స్తోమతను బట్టి వారి వారి ఇళ్ళలో అలమరలో కానీ, ఒక ప్రత్యేక గదిని కానీ ఏర్పాటు చేసుకుంటారు.
దేవుడి గదిని ఈశాన్యంలో ఉంచడం ఉత్తమం. కానీ ఈశాన్యంలో ఎత్తైన అరుగులు నిర్మించకుండా, ఒక పీట వేసికానీ, లేదా ఏదైనా వస్త్రము వేసి దానిపై దేవుడి ప్రతిమలు లేదా పటాలు ఉంచి పూజ చేసుకోవచ్చును. ఒకవేళ పటాలను గోడకు వేలడదీయవలసి వస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు వేలాడదీయవచ్చును. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలు కాకపోతే తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయువ్యాలలో దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవచ్చును.

Address

Kadiri
515591

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+91 9701397395

Website

Alerts

Be the first to know and let us send you an email when Vastu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vastu:

Share