Thallada

Thallada తల్లాడ is a Mandal in Khammam district of Telangana, India. తల్లాడ is a Mandal in Khammam district of Andhra Pradesh, India. And Shivalayam , Ramalayam.

According to Indian census, 2001, the demographic details of Tallada mandal is as follows

Total Population: 54,266 in 12,691 Households. Male Population: 27,698 and Female Population: 26,568

Children Under 6-years of age: 7,007 (Boys – 3,513 and Girls – 3,494)

Total Literates: 26,024

2906 Acres మాగాణి 1098 Acres మెట్ట. Villages:

The villages in Thallada mandal includes:

Anjanapuram, Annargud

em, Basavapuram, Billupadu, Gollagudem, Gopalapeta, Kalakodima, Kesavapuram, Kodavatimetta, Kotha Venkatagiri, Kurnavalli, Laxmipuram, Mallaram, Mangapuram, Mittapalli, Muddunuru, Narayanapuram, Nuthankal, Pinapaka, Ramachandrapuram, Ramanujavaram, RangamBanjara, Rejerla, Telagaram, Thallada and Vengannapeta

Important Places:

Nityam Pujalandukunee Lord Venkateswara & HanumanTemple. Jeeva nadhulanti moodu CHERUVULU,

Raastram Lonee Rendo Athi Pedda RING ROAD,

Binna Rastraalanu – Palu Jillalanu Kalupu Atipedda KUDALI ,

Vinodaniki VENKTRAMA theatre – Bojananiki MATTAMMA And LALITHAMMA hotel,

Lourdhu Matha Church is an important place to visit in Thallada.

రాయల రాము ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరంతల్లాడ: స్థానిక మండల కేంద్రంలో ది.08 /07/2024 నాడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర...
06/07/2024

రాయల రాము ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

తల్లాడ: స్థానిక మండల కేంద్రంలో ది.08 /07/2024 నాడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఉచిత వైద్య శిబిరం ఎమ్మార్వో ఆఫీస్ రోడ్ పక్కనే ఉన్నటువంటి వాలీబాల్ స్టేడియం లో నిర్వహిస్తున్నారు ఉచిత మెగా వైద్య శిబిరం నీ ప్రారంభించడానికి స్థానిక సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్ట రాగమయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ విచ్చేస్తున్నారు శిబిరం నందు ఈసీజీ. బిపి షుగర్ టు డీ ఈకో. కంటికి సంబంధించిన చెకప్. పలురకమైనటువంటి జనరల్ చెకప్ చేస్తారు శిబిరానికి అందుబాటులో ఉండేటువంటి హాస్పిటల్ యశోద హాస్పిటల్ అంకుర హాస్పిటల్. మాక్స్ విజన్ హాస్పిటల్ ఉచిత శిబిరంలో పాల్గొంటున్నాయి కావున అవకాశాన్ని ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలీ అని ఈ సందర్భంగా Ramu Rayala రాయల రాము చెప్పడం జరిగింది

Mega Job Mela.....
26/06/2024

Mega Job Mela.....

వర్షాలు కురవాలని తల్లాడలో ముత్యాలమ్మకు జలాభిషేకం ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండాలని  తల్లాడ పట్టణ పెద...
24/06/2024

వర్షాలు కురవాలని తల్లాడలో ముత్యాలమ్మకు జలాభిషేకం

ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండాలని తల్లాడ పట్టణ పెద్దలు, ప్రజలు ఆదివారం రాత్రి ముత్యాలమ్మ, గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి మామిడి తోరణాలు కట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక అర్చకులు సతీష్ శర్మ చే ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సకాలంలో కురిసి పంటల పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జవ్వాజి నరసింహారావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, దగ్గుల నాగిరెడ్డి, నంబూరి మోహన్ రావు, దగ్గులా జనార్దన్ రెడ్డి Bhaskar Rao Kethepally , వేమిరెడ్డి మోహన్ రావు, Vemisetty Nageswararao వేమీశెట్టి నాగన్న, రాయల తిరుమలయ్య, మొక్క బసవయ్య, Harish Reddy, వెంకటయ్య, సురేష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

*బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులను సన్మానించిన ఎంపీపీ*...పిల్లలకు *విశేష జ్ఞానాన్ని అందించారని కితాబు*...Annaru Gudem జిల్ల...
23/06/2024

*బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులను సన్మానించిన ఎంపీపీ*...

పిల్లలకు *విశేష జ్ఞానాన్ని అందించారని కితాబు*...

Annaru Gudem జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత *పది సంవత్సరాలుగా* విధులు నిర్వహించి *బదిలీపై* వివిధ ప్రాంతాలకు వెళుతున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను *ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు నేతృత్వంలో* స్థానిక మాజీ సర్పంచ్ *మారెళ్ళ మమతతో* కలిసి ఘనంగా సన్మానించి సత్కరించారు..

అనంతరం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో పని చేసి వారికున్న విశేష జ్ఞానాన్ని విద్యార్థులకు అందించారని,అంతే కాకుండా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు చెట్లను నాటించి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పాఠశాలను సుందరవణంగా తయారు చేశారని, విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసించిందేందుకు ఇది ఎంతో ఉపయోగపడిందని, అదేవిధంగా విద్యార్థులకు బోధనోపకరణలు,తదితర మౌలిక సదుపాయాలు అందించేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సహకారం అందేందుకు బయాలజీ టీచర్ మాదినేని నరసింహారావు కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా నరసింహారావు సేవలను ఆయన కొనియాడారు..

అనంతరం బదిలీపై వెళ్తున్న ఆరుగురు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు..

ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంఈఓ దామోదర్ ప్రసాద్, అన్నారుగూడెం గ్రామ మాజీ సర్పంచ్ మారెళ్ళ మమత,భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు,బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మారెళ్ళ దేవేందర్,గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గినేని వెంకటయ్య,కాంగ్రెస్ నాయకులు పొన్నం కృష్ణయ్య, రిటైర్డ్ టీచర్ పులి సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు యాకూబ్ పాషా,సుంకర వేలాద్రి,పులి నాగేశ్వరరావు,అమర్లపూడి భవాని,సుదర్శన్,నరసింహారావు* తదితరులు ఉన్నారు....

23/06/2024

*మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి*

*సూర్యాపేట :* తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి Ponguleti Srinivas Reddy పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కన్వాయిని ఆపి తన కన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రజలు , క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు

విద్యార్థులకు నోటుపుస్తకాలు స్టేషనరి పంపిణీ.తల్లాడ -23: తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో కారుణ్య సర్వీస్ సొసైటీ మరియు ...
23/06/2024

విద్యార్థులకు నోటుపుస్తకాలు స్టేషనరి పంపిణీ.

తల్లాడ -23: తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో కారుణ్య సర్వీస్ సొసైటీ మరియు దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, స్టేషనరి ని కారుణ్య సర్వీస్ సొసైటీ, మరియు దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య సభ్యులు ఆదివారం పంపిణీ చేశారు, ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి రాణించాలన్నారు,ఈ కార్యక్రమంలో కారుణ్య సర్వీస్ సొసైటీ కార్యదర్శి గొడుగునూరి బాలరెడ్డి, దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు Naresh Gumma గుమ్మా నరేష్, కార్యదర్శి తిగుళ్ల నరసింహరావు, దార సంతోష్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

23.06.24 ఆదివారం*lతల్లాడ మండలంలో రింగ్ రోడ్డు సెంటర్ నందు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి , రాష్ట్ర...
23/06/2024

23.06.24 ఆదివారం*l
తల్లాడ మండలంలో రింగ్ రోడ్డు సెంటర్ నందు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ గారి ఆదేశాల మేరకు మరియు తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు Kapa Sudhakar కాపా సుధాకర్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షులు యర్రి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు Anumula Revanth Reddy ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, అభిమానులు, కార్యకర్తలు, పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.*

*ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావును సన్మానించిన  మాజీ సర్పంచ్, నాయకులు..*  *తల్లాడ మండలంలోని అన్నారుగూడెం జిల్లా పరిషత్ ...
22/06/2024

*ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావును సన్మానించిన మాజీ సర్పంచ్, నాయకులు..*

*తల్లాడ మండలంలోని అన్నారుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి బదిలీపై పెద్దగోపతి పాఠశాలకు వెళ్లిన మాదినేని నరసింహారావును అన్నారుగూడెం మాజీ సర్పంచ్ మారెళ్ళ మమత, కాంగ్రెస్ పార్టీ నాయకులు Ramesh Thummalapalli తుమ్మలపల్లి రమేష్ సన్మానించారు. శనివారం అన్నారుగూడెం పాఠశాలలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను వారు శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నం కృష్ణయ్య, దుగ్గినేని వెంకటయ్య, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్. యాకూబ్ పాషా, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.*

22/06/2024

వర్షాల కోసం ముత్యాలమ్మ తల్లికి జాలాభిషేకం

తల్లాడ భక్త మహాశయులకు మనవి

మన తల్లాడ గ్రామములో వెంచేసియున్నా
శ్రీముత్యాలమ్మ తల్లి*అమ్మవారికి* రేపు అనగా ది 23.06.2024 ఆదివారము ఉదయం 9 గంటలకు. సకాలంలో వర్షాలు పడాలని చెరువులన్నీ నిండి పాడిపంటల సమృద్ధిగా ఉండాలని ముత్యాలమ్మ తల్లికి జలాభిషేక కార్యక్రమం గ్రామంలో ఉన్న భక్తుల సహకారంతో జరుగుతుంది.
కావున గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అందరూ వర్షాలు బాగా పడాలని అమ్మవారికి మొక్కుకొని తల ఒక బింద నీళ్లు సమర్పించగలరు....

ఆరోగ్యమే మహాభాగ్యం..పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లతో.... ఆనందదాయకమైన ఆరోగ్యం సొంతం...   - జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమ...
20/06/2024

ఆరోగ్యమే మహాభాగ్యం..

పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లతో....

ఆనందదాయకమైన ఆరోగ్యం సొంతం...

- జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో ఎంపీపీ వ్యాఖ్యలు....

తల్లాడ జూన్ 20, సామాజిక తెలంగాణ న్యూస్....

తల్లాడ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమమును తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు గురువారం ఉదయం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ ఈ యొక్క నులిపురుగుల నివారణ మాత్రలను తప్పకుండా వేసుకోవాలని తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలందరూ మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తూ,పరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు
కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక వైద్యాధికారి రత్న మనోహర్ మాట్లాడుతూ నులిపురుగులు విద్యార్థుల జీర్ణాశయంలో ఉండటంవల్ల విద్యార్థులకు రక్తహీనత,కడుపులో నొప్పి, విరోచనాలు,బుద్ధి మాంద్యం, జ్ఞాపకశక్తి కోల్పోవడం తదితర లక్షణాలు ఉంటాయని ఆయన తెలియజేశారు ఈ నులిపురుగులు భారిన పడకుండా ఉండాలంటే విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆహారం తినే ముందు, బాత్రూమ్ ను ఉపయోగించిన తర్వాత సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుకోవాలని తెలియజేశారు.ఈ జాతీయ నులుపురుగుల కార్యక్రమం సందర్భంగా మన తల్లాడ మండలంలో సుమారు 6400 మందికి నులిపురుగుల నివారణ మాత్రలు పిల్లలకు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు .

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్యాధికారి ఐ. రత్న మనోహర్,పాఠశాల ఉపాధ్యాయులు,ప్రసూన హెల్త్ సూపర్వైజర్స్ భాస్కర్,పెద్ద పుల్లయ్య, మేరమ్మ,భద్రమ్మ,మరియు ఆర్ బి ఎస్ కే సిబ్బంది,డాక్టర్ శ్రీనివాస్,ఏఎన్ఎం లు అంగన్వాడీ కార్యకర్తలు, మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

భారతదేశ వ్యవసాయ రంగాన్ని ప్రపంచంలోనే అగ్ర గామిక నిలుపుతున్న ఘనుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ పతి వెంకటరామారావు భాజాప తల...
19/06/2024

భారతదేశ వ్యవసాయ రంగాన్ని ప్రపంచంలోనే అగ్ర గామిక నిలుపుతున్న ఘనుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ

ఆ పతి వెంకటరామారావు భాజాప తల్లాడ మండల అధ్యక్షులు

17వ విడత కిసాన్ సమాన్ నిధి యోజన విడుదల కార్యక్రమం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల శాఖ ఆధ్వర్యంలో తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్ నందు పాలాభిషేకం చేయటం జరిగినది మండల శాఖ అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాజాపా నాయకులు కార్యకర్తలు పలువురు రైతులు పాల్గొని తల్లాడ లోని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయటం జరిగినది ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమంగా స్వాతంత్రానంతరం రైతులకు దేశవ్యాప్తంగా రైతు సహాయం కోసం కిసాన్ సామాన్ నిధిని గత ఆరున్నర సంవత్సరాల నుండి రైతుల ఖాతాలో ప్రతి సంవత్సరమునకు 6 వేల రూపాయలు సహాయం అందిస్తున్నటువంటి తరుణంలో నిన్న వారణాసిలో 17 విడత కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాలోజమ చేయడం జరిగినది రైతుల లందరూ ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తున్నారని తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయక దేశాన్ని పంటల ఉత్పత్తిలోనే ప్రధమంగా ఉండేటట్లు చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి ఎనలేనిది అని తెలిపారు రైతాంగానికి ఎరువులు సబ్సిడీని సబ్సిడీని కొనసాగిస్తూ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయుటకు రైతులకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారని ఎఫ్ పి ఓ చేయించి నేరుగా రైతులకు అమ్ముకునే మార్కెట్ సౌకర్యం కల్పించారని దాని వలన దేశములో రైతులందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారని ఎఫ్ బి ఓ ల ద్వారా రైతాంగం కి కొన్ని వేల కోట్ల రూపాయలు రుణాలు తక్కువ వడ్డీతో ఇస్తున్నారని తెలిపారు 2014 నుండి నేడు 2024 లో రైతుల ఉత్పత్తుల ధరలు రెట్టింపు చేసినటువంటి ఘనుడు మోడీ అని కొనియాడారు కేవలం ఒక వ్యవసాయ రంగమే కాకుండా అన్ని రంగాలలో దేశాన్ని గత పది సంవత్సరాల నుండి అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన ఘనుడు మోడీ అని అన్నారు పారిశ్రామిక విద్య టెక్నాలజీ ఏ రంగం చూసిన భారతదేశ ముందు అడుగు వేస్తుందని తెలిపారు అలాంటి మోడీ ప్రభుత్వాన్ని అందుకనే మరలా ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఈ ప్రధానే భారతదేశానికి మరలా కావాలని ప్రజలు నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా మద్దతు తెలిపి మరలా ప్రధానిగా చేశారని ఇది భారత దేశ ప్రజల విజయమని తెలిపారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తరువాత రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధమంగా నిన్న వారణాసిలో 17 విడత దేశవ్యాప్తంగా 9.6 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయల నిధిని రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఘనుడు నరేంద్ర మోడీ ఏ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లా నాగులు మండల ఉపాధ్యక్షురాలు నన్నపనేని శారద మండల ప్రధాన కార్యదర్శి గాద కృష్ణారావు ఓబీసీ మోర్చా నాయకులు వాడవల్లి నాగేశ్వరరావు యువమోర్చా అధ్యక్షులు ఎల్లంకి సుధాకర్ కార్యదర్శి రాయల రమేష్ నాయకులు చల్లా నరేష్ పెరిక కిరణ్ చల్లా కృష్ణ వేముల వెంకటరామయ్య శీలం మహేష్ రెడ్డి పలువు రైతులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆపతి వెంకట రామారావు భాజపా మండల అధ్యక్షులు

I am inviting you to Join the India's Biggest Yoga Session NOW!!🤩FREE YOGA | 14 Days Online🧘🏻‍♀ 🗓️starts *17th June*    ...
18/06/2024

I am inviting you to Join the India's
Biggest Yoga Session NOW!!🤩

FREE YOGA | 14 Days Online🧘🏻‍♀
🗓️starts *17th June*

• Burn FAT 🔥
• Reduce STRESS 😇
• Become FLEXIBLE 🏃

with Saurabh Bothra 🧘
Govt Certified Yoga Trainer
World Record Holder 🥇
IIT Graduate | 12+ Years Exp

Click on the Link below to Know More 👇🏻

Join our Free Yoga Sessions with our certified trainer Saurabh Bothra at Habit.yoga. Our Online program will help you to improve your physical and mental health.

Address

Thallada
Khammam
507167

Website

Alerts

Be the first to know and let us send you an email when Thallada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share