MVN Degree n PG college, Mancherial

MVN Degree n PG college, Mancherial one of the top most famous colleges in mancherial,adilabad dist. admin : Boddu Mahender (www.boddumahender.com)
Visit : www.adilabaddistrict.com

one of the top most colleges in mancherial,adilabad dist

ఏళ్ళు గడవొచ్చుఎదలోని భావం మారదుగాకలిసి లేకపోవచ్చుకలవాలన్న తలపు మారదుగాబాధ్యతలు ఎన్నైనా ఉండొచ్చుబంధాల్ని మరిచి పోవద్దుగాప...
24/02/2025

ఏళ్ళు గడవొచ్చు
ఎదలోని భావం మారదుగా
కలిసి లేకపోవచ్చు
కలవాలన్న తలపు మారదుగా
బాధ్యతలు ఎన్నైనా ఉండొచ్చు
బంధాల్ని మరిచి పోవద్దుగా
ప్రేరణ నిచ్చిన ప్రియతముల
స్నేహాల్ని వదులు కోవద్దుగా
కలుద్దాం ఒక్కసారైనా
పిలుద్దాం ద్వేషాలెన్నున్నా
నిలుద్దాం ఒక్క బ్యాచ్ గా అయినా
గెలుద్దాం మన అనుకునే మనసులనైనా
- బొడ్డు మహేందర్
చెన్నూరు, మంచిర్యాల జిల్లా
(ఫ్రెండ్స్ రీ యూనియన్ సందర్భంగా)

05/10/2024

గత సంవత్సరం నుండి నా హాబీల్లో కొత్తగా చేరింది ట్రెక్కింగ్. 2023 సంవత్సరంలో సంక్రాంతికి మహారాష్ట్ర లోని హరిహర ఫోర్ట్ కి తొలిసారి వెళ్లాను. ఆ తర్వాత అనేక ప్రాంతాలు , రాష్ట్రాలు చుట్టి వచ్చాను. డిసెంబర్ లో పూణే కి దగ్గర్లో జీవ ధన్ ఫోర్ట్ ట్రెక్కింగ్, 400ft రాపెల్లింగ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అనేక ప్రాంతాల్లో కోటలు, కొండలు ఎక్కాను. మళ్ళీ ఈ మధ్యలో గత వారం నాసిక్ దగ్గర్లో షిట్కడా వాటర్ ఫాల్ 350ft రాపెల్లింగ్ చేశాను. అయితే ఈ అన్ని ప్రయాణాల్లో ఈసారి మాత్రం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. RAC సీట్ తో రైలు ప్రయాణం తోనే నా కష్టాలు మొదలయ్యాయి. తర్వాత నాసిక్ చేరుకున్నాక అక్కడి నుండి ఆ జలపాతం ఉన్న ప్రాంతానికి వెళ్ళాక కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. భారీగానే పడింది. రాపెల్లింగ్ క్యాన్సిల్ అన్నారు కానీ, ఇంత దూరం వచ్చాక ఉత్తగానే తిరిగిపోవాలని పించక చెన్నై, బెంగుళూరు నుండి వచ్చిన వాళ్ళతో నేను కూడా ఎదురుచూశాను. కొంత సేపటికి వర్షం తక్కువైంది కానీ డ్రోన్ షూట్స్ వల్ల అక్కడ ఉండే తేనెటీగలు మా అందరిపై దాడి చేశాయి. నాకు కూడా రెండు చోట్ల తేనెటీగలు చురకలు వేసాయి. ముఖానికి మొత్తం టవల్ చుట్టుకున్నా కూడా నా తలపై మూగి చాలానే ఉండటం వల్ల , అక్కడ ఉండే మిగతా ట్రెక్కర్స్ నాపై నీళ్లు చల్లడం మొదలుపెట్టారు . దాంతో నా మొబైల్ పాడవుద్దని నా ట్రెక్ టీం లీడర్ కి ఇస్తే ఆమె ఆ జలపాతం గట్టున పెట్టేసింది. ఈ తేనెటీగల దాడి ఆల్మోస్ట్ రెండు గంటలు కొనసాగుతుండగా అక్కడ ఒకపక్కన నా మొబైల్ పైన కురుస్తున్న వర్షానికి పూర్తిగా మునిగిపోయి పాడైపోయింది. ఇంకో పక్క వర్షం వల్ల ఆ జలపాత ప్రవాహం పెరిగి ఆవిరి ఎక్కువైపోయి ఫోటోలు , వీడియోలు తీసే ఛాన్స్ కూడా లేకుండా అయ్యింది. అప్పటికే సాయంత్రం 4 ఐంది. మధ్యాహ్న భోజనం కూడా లేదు. కనీసం ఆ రాపెల్లింగ్ అయితే ఆత్మ సంతృప్తి అయినా ఉంటుంది అనుకోని ఎదురుచూస్తూ చివరికి ఆ వర్షంలోనే వరద ప్రవాహం లోనే జారుతూ పడుతూ రాపెల్లింగ్ చేశా. దీంతో నా బ్యాగ్ మొత్తం పూర్తిగా తడిసిపోయింది. అందులో ఉన్న అన్ని ఎలెక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయి . మరో మొబైల్ కూడా పాడైంది. insta 360 కెమెరా కూడా బాక్స్ లో పెట్టకపోతే పగిలిపోయేదే. బాక్స్ పగిలింది కానీ దానికేమి కాలేదు. అది వాటర్ ప్రూఫ్ కూడా కావడం వల్ల నీటి లో మునిగినా ఏమి కాలేదు . కానీ వీడియోలు అంత క్లారిటీ గా రాలేదు కొన్ని. ఆ తర్వాత ఆ వరద ప్రవాహం పక్కనే ఓ అర కిమీ దాకా నడుస్తూ పోవాలి ..అది కూడా అత్యంత ప్రమాదకరమైన జారుడు బండ వంటి పదునైన రాళ్ళ మీద నడుస్తూ .. ఈ క్రమంలో ఆ రాళ్లపై నేను కూడా పడ్డాను. అప్పుడే జలపాతాల దగ్గర ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారో అర్ధమైంది. ఒకసారి చేయి విరిగిందేమో అని సందేహం వచ్చింది. రెండు కాళ్లకు చిన్న చిన్న గాయాలయ్యాయి . ఇంకో చోట తగిలిన దెబ్బ తో ఇంటికి వచ్చిన 4 రోజుల వరకు కూడా సరిగా కూర్చోలేకపోయా. ఇలా అవస్థలు పడుతూనే ఆ వరద ప్రవాహం పక్కన వెల్తూ దాదాపు 4 సార్లు ఛాతీ అరకు వచ్చిన నీటి ప్రవాహాన్ని అటు నుండి ఇటు , ఇటు నుండి అటు దాటాల్సి వచ్చింది . అలా మొత్తం బ్యాగ్ తడిసి బరువు రెట్టింపు అయింది. అప్పుడే దాదాపు 400 ft ఉన్న ఎత్తైన కొండని కూడా ఎక్కాలి. చేసేదేమి లేక తోటి ట్రెక్కర్స్ అందించిన సహాయ సహకారాలతో దాదాపు 12 నుండి 15 కిలోల బరువున్న బ్యాగును మోస్తూ ఆ కొండ ఎక్కేసి ట్రెక్ బేస్ క్యాంప్ కి చేరుకున్నాను . కానీ నా టూర్ ప్లాన్ పూర్తి కావాలంటే ఇంకో రెండు రోజులైనా ఉండాలి కానీ, ఫోన్లు పాడవడం వల్ల కమ్యూనికేషన్ లేదు. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఏవీ కొనలేను . జ్ఞాపకాలుగా చూసుకోవడానికి ఫోటోలు వీడియోలు తీయడం కుదరదు. అక్కడ పరిచితులు ఎవరూ లేరు. నేను తెలంగాణ నుండి ఒక్కడినే వెళ్లాను . అక్కడ ఉన్న వాళ్లలో నేను ఒక్కణ్ణే తెలుగు వాణ్ని. కాబట్టి నా దగ్గర ఉన్న కొంత నగదు తోనే తిరుగు ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాను. కానీ నా ఫోన్ బాగయ్యే వరకు 5 రోజులు పట్టింది . ఇప్పుడు చూస్తే నేను జలపాతం రాపెల్లింగ్ చేసే వరకు తీసిన వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి , అదొక్కటే కొంచెం రిలీఫ్ అనిపించింది ఈ ట్రెక్కింగ్ లో .

Get together banner...
29/05/2024

Get together banner...

29/05/2024
MVN Degree College Old campus building...Godavari road..
27/05/2024

MVN Degree College Old campus building...
Godavari road..

MVN Microbiology students reunion...in SAKSHI, ANDHRAJYOTHY, EENADU news papers..
27/05/2024

MVN Microbiology students reunion...
in SAKSHI, ANDHRAJYOTHY, EENADU news papers..

Mahatma Gandhi Biography in Telugu || MAHE ON || BODDU MAHENDER ||జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను సంక్షిప్తంగా లక్ష...
23/06/2018

Mahatma Gandhi Biography in Telugu || MAHE ON || BODDU MAHENDER ||
జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను సంక్షిప్తంగా లక్ష్యిత జీవితం పేరుతో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. "సత్యశోధన"(My Experiments with Truth) అనే గాంధీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని బాపు వ్యక్తిత్వ విశ్లేషణలతో కూడిన ఒక విభిన్న చారిత్రక రచన. ఇది చరిత్ర విద్యార్థులకే కాకుండా గ్రూప్స్, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల రాసే వారికోసం అభ్యర్థులకు చక్కని సమాచారాన్ని, విశ్లేషణని అందిస్తుంది. కావున ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేసేందుకు ప్రోత్సహించండి. మీ విలువైన సూచనలని, సలహాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
- బొడ్డు మహేందర్,
Mahe On Channel
Please Subscribe for more latest updates

Mahatma Gandhi Biography in Telugu || MAHE ON || BODDU MAHENDER || జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను సంక్షిప్తంగా లక్ష్యిత జీవితం పేరుతో ఈ వీడియోలో చ...

https://drive.google.com/file/d/1HgUyDd32dFOwAWncZZGR_JHr1JWsPdca/view?usp=sharingఈరోజు ఉదయం చెప్పినట్లుగానే నేను ఎంతో క...
29/04/2018

https://drive.google.com/file/d/1HgUyDd32dFOwAWncZZGR_JHr1JWsPdca/view?usp=sharing
ఈరోజు ఉదయం చెప్పినట్లుగానే నేను ఎంతో కష్టపడి గత మూడేళ్ళుగా సేకరించి రూపొందించిన 200కు పైబడిన వాల్ పేపర్లను పిడిఎఫ్ లో ఉచితంగా అందిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. కుదిరితే షేర్ చేయండి. వీలైతే డౌన్లోడ్ చేసుకొని మీరూ పాటించండి.
- బొడ్డు మహేందర్, మహాన్ యూత్ వెల్ఫేర్ సొసైటీ

మన చెన్నూరు పరిసర ప్రాంతాల గురించి ఇప్పటివరకు నేను తీసిన వీడియోలు/ చేసిన స్లైడ్ షో లు ఆర్టీసీ బస్సులో చెన్నూరు పట్టణ ప్ర...
11/04/2018

మన చెన్నూరు పరిసర ప్రాంతాల గురించి ఇప్పటివరకు నేను తీసిన వీడియోలు/ చేసిన స్లైడ్ షో లు

ఆర్టీసీ బస్సులో చెన్నూరు పట్టణ ప్రవేశం
https://www.youtube.com/watch?v=IR_gPQy1nLo

ఇదీ మా చెన్నూరు పట్టణం
https://www.youtube.com/watch?v=d8bj_4o1Vcg

చెన్నూరు లోని వీధులు - పార్ట్ 1
https://www.youtube.com/watch?v=Hb0Et1fD2tI

చెన్నూరు లోని వీధులు - పార్ట్ 2
https://www.youtube.com/watch?v=P1G8Q2GZ_ig

చెన్నూరులో కొత్త బస్టాండ్ నుండి మా ఇంటి వరకు
https://www.youtube.com/watch?v=PwvzmA2BUp8

చెన్నూరులోని శివాలయం
https://www.youtube.com/watch?v=FiQQ9-Vl1oU

చెన్నూరులోని శివాలయం స్లైడ్ షో
https://www.youtube.com/watch?v=kQKjqaPZQQI

చెన్నూరులోని జగన్నాథ ఆలయం
https://www.youtube.com/watch?v=uqrpZ1lv664

చెన్నూరులోని జగన్నాథ ఆలయం గురించి ప్రధానార్చకులు
https://www.youtube.com/watch?v=TPTwwKUIXU0

చెన్నూరు లోని గోదావరి నదీ తీరం
https://www.youtube.com/watch?v=YQh9pjiMVmY

చెన్నూరు లోని హరిహరసుత అయ్యప్ప దేవాలయం
https://www.youtube.com/watch?v=QDcNh5Im8p0

చెన్నూరులోని ప్రతాప మారుతీ మందిరం
https://www.youtube.com/watch?v=H4PxN0Sixss

చెన్నూరులోని బడా హనుమాన్ టెంపుల్
https://www.youtube.com/watch?v=9MLgT7q5L9g

చెన్నూరులోని చోటా హనుమాన్ టెంపుల్
https://www.youtube.com/watch?v=DYlwTFz5DIw

చెన్నూరులోని రౌండ్ హనుమాన్ టెంపుల్
https://www.youtube.com/watch?v=hHQCJ9pmEt8

చెన్నూరులోని మధన పోచమ్మ ఆలయం
https://www.youtube.com/watch?v=eM9EuXP_VXQ

చెన్నూరులోని మధన పోచమ్మ ఆలయం స్లైడ్ షో
https://www.youtube.com/watch?v=tjfR_C84ReQ

చెన్నూరులోని షిర్డీ సాయి ఆలయం
https://www.youtube.com/watch?v=f1zphqWM1gQ

చెన్నూరులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం
https://www.youtube.com/watch?v=GlNdKOsBb5I

చెన్నూరులోని పుప్పాల హనుమాన్ మందిరం
https://www.youtube.com/watch?v=dtIUqSvDW3E

చెన్నూరులోని చిన్న శివాలయం
https://www.youtube.com/watch?v=DfTvVJk1Ab8

కత్తెరసాల రోడ్ కి దగ్గరలోని హనుమాన్ మందిరం
https://www.youtube.com/watch?v=Mp0hrdEDRdM

చెన్నూరులోని నల్లగొండ పోచమ్మ దేవాలయం
https://www.youtube.com/watch?v=Ja-ssYqagHM

చెన్నూరులోని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆలయం
https://www.youtube.com/watch?v=J0zCe7YyMZ0

చెన్నూరులోని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆలయం స్లైడ్ షో
https://www.youtube.com/edit?video_id=weVuJLPjClg

చెన్నూరులోని గాంధీ చౌక్
https://www.youtube.com/watch?v=oRYXN1riqH4

చెన్నూరులోని పాత బస్టాండ్ / అంబేద్కర్ చౌక్
https://www.youtube.com/watch?v=6yyHs5mE-uQ

చెన్నూరులోని ఎమ్మార్వో / తహసీల్దార్ కార్యాలయం
https://www.youtube.com/watch?v=9EyM9_bgQX0

చెన్నూరులోని కొత్త బస్టాండ్ (పాత వీడియో)
https://www.youtube.com/watch?v=FvvjwIXAdpA

చెన్నూరులోని కొత్త బస్టాండ్ (కొత్త వీడియో)
https://www.youtube.com/watch?v=k9w_F06qVEo

చెన్నూరులోని కొత్త బస్టాండ్ (సమస్యల గురించిన వీడియో)
https://www.youtube.com/watch?v=KaeiKEO67G0

చెన్నూరులోని శాఖా గ్రంథాలయం
https://www.youtube.com/watch?v=lmHnwU3Kwwk

చెన్నూరులోని కూరగాయల మార్కెట్
https://www.youtube.com/watch?v=Nh50sf8cbzM

చెన్నూరులోని గ్రామ పంచాయితీ గోడలపై ఉన్న సూక్తులు
https://www.youtube.com/watch?v=iaV2JD3M7v0

చెన్నూరు గ్రామ విశిష్టతను తెలిపే జక్కేపల్లి నాగేశ్వర రావు పాట
https://www.youtube.com/watch?v=YiULZoylPio

కొత్త బస్టాండ్ నుండి అయ్యప్ప దేవాలయం వరకు గల రహదారి
https://www.youtube.com/watch?v=lMok_i7MZaM

చెన్నూరులోని కవుల గురించి జక్కేపల్లి నాగేశ్వర రావు ఉపన్యాసం
https://www.youtube.com/watch?v=Vf4JRlX6ijM

గోమాత విశిష్టత గురించి జగన్నాథ ఆలయ ప్రధానార్చకులు
https://www.youtube.com/watch?v=uVFdIBM36zk

కవి రేవెల్లి రామయ్య గారి కవితా పఠనం
https://www.youtube.com/watch?v=uDwsqnnKJxs

చెన్నూరు దగ్గరలోని సుద్దాల రామాలయం
https://www.youtube.com/watch?v=6wKLtiWk010

కత్తెరసాల మల్లన్న స్వామి దేవాలయం
https://www.youtube.com/watch?v=C3cOogYmsZg&t=4s

కత్తెరసాల మల్లన్న స్వామి బోనాలు
https://www.youtube.com/watch?v=0H34SHM-wQk&t=123s

గాంధీ పార్కు, Gandhi Park, Mancherial || MAHE ON || BODDU MAHENDER ||మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ కి వెళ్ళే రోడ్ ...
08/04/2018

గాంధీ పార్కు, Gandhi Park, Mancherial || MAHE ON || BODDU MAHENDER ||
మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ కి వెళ్ళే రోడ్ లో, గ్రంథాలయం పక్కన ఆనుకొని ఉన్న గాంధీ పార్కు

గాంధీ పార్కు, Gandhi Park, Mancherial || MAHE ON || BODDU MAHENDER || మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ కి వెళ్ళే రోడ్ లో, గ్రంథాలయం పక్కన ఆనుకొ.....

21/03/2018

Swami Vivekananda Famous 100 Quotations in Telugu || MAHE ON || BODDU MAHENDER || స్వామి వివేకానంద ప్రవచించిన అత్యంత ప్రసిద్ధి పొందిన 100 సూక్తులు/ హితోక్తుల...

దుర్బిణి.... ప్రపంచ తెలుగు కవులు, రచయితల దర్శినిచివరి తేది నవంబర్ 15, 2017**********************************************...
14/11/2017

దుర్బిణి.... ప్రపంచ తెలుగు కవులు, రచయితల దర్శిని
చివరి తేది నవంబర్ 15, 2017
***********************************************************
400 పేజీల అంచనాతో ముందడుగు వేస్తున్న ఈ పుస్తకంలో ఇప్పటికే 175 పేజీల టైపింగ్ పూర్తయింది. 2000+కవులు, రచయితల ప్రాథమిక సమాచారం పొందుపరచబడుతోంది. ఒక మహాద్భుత నిర్మాణంలో మీ వంతు చేయూతనందించండి.
******************************************************************
శ్రీ బొడ్డు మహేందర్ గారి సంపాదకత్వంలో..
జిల్లా, రాష్ట్రం, దేశం అనే హద్దులు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు,రచయితల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు నెలకొనడానికి, సాహిత్య సాంస్కృతిక సంస్థలు పటిష్టం అవడానికి, ముఖ్యంగా సాహితీ పరిశోధకులకు ఒక మార్గ దర్శకంగా నిలవడానికి, చేస్తున్న బృహత్తర ప్రయత్నమే ఈ
*"ప్రపంచ తెలుగు కవులు-రచయితల డైరెక్టరీ"*
“దుర్బిణి” పేరుతో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించే ఈ గ్రంథంలో, మీ బయోడేటా, చిరునామా,ఫోన్, ఈమెయిల్, బ్లాగు, రచనల వివరాలు ఉండాలి అనుకుంటే వెంటనే మీ వివరాల్ని *9963427242* నంబర్ కి వాట్సాప్ చేయండి. లేదా [email protected] కి ఈమెయిల్ చేయండి. లేదా బొడ్డు మహేందర్ , ఇంటి నం.2-26, ఆదర్శ నగర్, చెన్నూర్ పోస్ట్ & మండలం. మంచిర్యాల జిల్లా. తెలంగాణ . పిన్ : 504201 చిరునామాకు మీ వివరాలని పోస్ట్ చేయండి. ధన్యవాదాలు

Address

IB Chowrastha , Mancherial
Mancherial
504208

Alerts

Be the first to know and let us send you an email when MVN Degree n PG college, Mancherial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MVN Degree n PG college, Mancherial:

Share