Mandapeta Official Updates - MOU

Mandapeta Official Updates - MOU Complete update pictures and information on Mandapeta town.

నిజానికి మండపేట అసలు పేరు మండవ్యపురం.దీనికి ఈ పేరు మాండవ్య అనే రాజు ఇక్కడ కొంత కాలం నివసించాడు కబటి వచ్చింది.జనార్ధన స్వామి గుడిని అంత రధం గుడి అంటారు .నారదుడు ఈ గుడిని ప్రతిస్తాపన చేసారు.ఇక్కడ ఉన్న బంగారు వ్యాపారుల వల చుటు ప్రకలవున ఊర్లకు కూడా ప్రసిది గాంచింది.ఎకువ శాతం జనాబా వ్యవసాయము మరియు వ్యాపారము వరే.చిన వ్యాపారాలు , వాణిజ్యంలో కూడా ఉన్నారు.ఈ ఊరిలో 7 సినిమా హాలు ఉన్నయి.అన్నిటిలోను ఎ

కువ శాతం కొత్త సినిమాలే వస్తాయి.వీటికి దగ్గర వున గ్రామాలకు ప్రసిధి.ఈ రోజు మండపేటలో 80 పైన రైస్ ఫ్యాక్టరీలు ఉన్నయి.మండపేట వ్యవసాయము మరియు డైయరిలకు (పాల పదార్ధాలు) ప్రసిధి.
మండపేట భుగోలములో16.52°N 81.55°ఎ వుంది.అది 52 అడుగుల ప్రకర్ష వుంది.
2001జనభ లేకల ప్రకారం మండపేటలో 47,115 మంది జనాభా ఉన్నరు.మగవాలు 50 %(62,020) , ఆడవాలు 50 % (61,847) ఉన్నరు.మండపేటలో 62% అక్షరజ్ఞానం ఉంది.ఇందులో మగవాలు 65% , ఆడవాలు 59% .ఇది జాతీయ అక్షరజ్ఞానం కంటే ఎక్కువ.మండపేటలో 11% మంది 6 కంటే తక్కువ వయస్సు వారు.
మండపేట 50 గ్రామాలకు వ్యాపారము మరియు వినోదము కలిపిస్తుంది.ఇక్కడే వారు LIC,ICICI,ఫోన్ బిల్లులు చెలిస్తారు.


మండలంలోని గ్రామాలు
§ కేశవరం
§ వేములపల్లి @ సీతయ్యపాలెం
§ ద్వారపూడి
§ చినదేవరపూడి
§ జి.మేడపాడు
§ మెరుయిపాడు
§ వెలగతోడు
§ పాలతోడు
§ ఇప్పనపాడు
§ తాపేశ్వరం
§ ఏడిద
§ ఏడిద సీతానగరం
§ అర్థమూరు
§ మారేడుబాక
§ మండపేట

అంబేద్కర్ బాట అందరికీ ఆదర్శం...విగ్రహాలు ఏర్పాటు కు శంఖుస్థాపన... మండపేట:-అంబేద్కర్ బాట అందరికి ఆదర్శమని వైఎస్సార్సీపీ న...
06/12/2023

అంబేద్కర్ బాట అందరికీ ఆదర్శం...
విగ్రహాలు ఏర్పాటు కు శంఖుస్థాపన...

మండపేట:-అంబేద్కర్ బాట అందరికి ఆదర్శమని వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు లు పేర్కొన్నారు. మండపేట కరాచీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం అంబేడ్కర్ 67 వర్ధంతిని విగ్రహాల ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణ పాపారాయుడు లు చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ కొత్తపేట నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసారు. అనంతరం విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహాల ప్రతిష్టకు భూమి పూజ చేశారు. అనంతరం ఆ వార్డు కౌన్సిలర్ ముక్కా మేరీ స్వరూపరాణి సుబ్రహ్మణ్యంలకు ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ లు దుశ్శాలువాతో సత్కరించారు. తమ వార్డు పరిధిలో మహనీయుల విగ్రహాలు వెలుస్తున్నందుకు ఆనందంగా ఉందని సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్లు వేగుళ్ల నారయ్యబాబు, పిల్లి గనేశ్వరరావు, దూలం వెంకన్నబాబు, తుపాకుల ప్రసన్న కుమార్, సాదే పిడుగు రాముడు, పట్టణ వైసీపీ కౌన్సిలర్లు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు మీగడ శ్రీనివాస్, షేక్ అలీఖాన్ బాబా తదితర నాయకులు శంఖుస్థాపన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ, పాపారాయుడు లు మాట్లాడుతూ ఇరువురు నాయకులు దేశ ప్రజలందరికీ ఆదర్శమన్నారు. వారిని కొన్ని వర్గాలకే పరిమితం చేశారన్నారు. వారు గుర్తుండి పోయేలా మండపేట మెయిన్ రోడ్డులో విగ్రహాలు నెలకొల్పాలని అనుకునే వారమన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చొరవతో మున్సిపల్ అధికార పార్టీ కౌన్సిల్ ద్వారా కార్యరూపం దాల్చిందన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు విగ్రహాల ప్రారంభోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. వైసీపీ నాయకులు చోడే శ్రీకృష్ణ, మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్, కౌన్సిలర్లు ముక్కా లోవలక్ష్మీ దాలయ్య, ముక్కా మేరీ స్వరూపారాణి సుబ్రహ్మణ్యం, పోతంశెట్టి వరప్రసాద్, చిట్టూరి సతీష్, ఎర్నేని ప్రభావతి, శెట్టి కళ్యాణి, నీలం దుర్గమ్మ, బొక్కా సరస్వతి, కొవ్వాడబేబీ అప్పన్నబాబు, అమలదాసు లక్ష్మి, గ్రంథి శ్రీనివాస్, మెండు బాపిరాజు, పిల్లి శ్రీనివాస్, వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, ఎస్సీ నాయకులు, వైసీపీ నాయకులు పంపన శ్రీనివాస్, సిరంగు శ్రీనివాస్, టేకిముడి శ్రీనివాస్, జొన్నపల్లి సత్తిబాబు, ఉండ్రాజవరపు అర్జున్, పలివెల సుధాకర్, వల్లూరి రామకృష్ణ, బూర చిన్న, గుమ్మడి అనిల్ కుమార్, సాధనాల శివ, కనికెళ్ళ ప్రసాద్, మందపల్లి సంజీవ్ కుమార్, కొల్లి వరలక్ష్మి, కోనాల చంద్ర బోస్, పొలమాల సత్తిబాబు, పాలపర్తి సురేష్ , వారా సన్నీ, దండంగి చింటు, గునిపే శ్యామ్, బూరిగ జానీ, కొడమంచిలి భాస్కరరావు, మందపల్లి సుధాకర్, గనిపే నాగభూషణం, కొమ్ము సూరిబాబు, పేకేటి మాణిక్యం, తుపాకుల ప్రసన్న కుమార్, మల్లిపూడి శివ, పాలంకి కిషోర్, కప్పల అన్నవరం, కొల్లి చిన్నారావు, సన్మాల వెంకన్న,పాలపర్తి కన్నా, ముమ్మిడివరపు చిన్న, మసిపిలి రవి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

NCBN @ కరాచి సెంటర్ , మండపేట
16/08/2023

NCBN @ కరాచి సెంటర్ , మండపేట

03/07/2023

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, నడి రోడ్లపై పుట్టిన రోజు కేక్ లు కట్ చేసుకోవడం వంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసుల్లో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు రామచంద్రపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కే. ప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాలు మేరకు రామచంద్రపురం సి.ఐ దుర్గారావు, మండపేట రూరల్ సీ.ఐ. పెద్దిరెడ్డి శివ గణేష్ ల నేతృత్వంలో రామచంద్రపురం డివిజన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సాధారణ ప్రజాజీవనానికి ఎవరు ఇబ్బంది కలిగించినా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు.

మండపేట ఎగిరిన వైఎస్సార్ జెండా...తోట హవా...22 స్థానాలు కైవసం...ఏడు స్థానాలకు టీడీపీ పరిమితం..రెబల్ గెలుపు...మండపేట:- మండప...
14/03/2021

మండపేట ఎగిరిన వైఎస్సార్ జెండా...
తోట హవా...
22 స్థానాలు కైవసం...
ఏడు స్థానాలకు టీడీపీ పరిమితం..
రెబల్ గెలుపు...
మండపేట:- మండపేట లో 35 ఏళ్ల తర్వాత టీడీపేతర పార్టీ జండా మునిసిపాలిటీ పై ఎగురింది.మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జ్ తోట త్రిమూర్తులు మార్క్ హవా స్పష్టం గా కనిపించింది. వైఎస్సార్సీపీ 22 స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ ఏడూ స్థానాలకు పరిమితం ఐయింది.వైస్సార్ సిపి రెబల్ అభ్యర్థి ఒకరు గెలుపొందారు.

వార్డుల వారిగా...
1వ వార్డులో వైసీపీ అభ్యర్థి పొత్తంశెట్టి ప్రసాద్ 232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2వ వార్డులో వైసీపీ అభ్యర్థి చిట్టూరి సతీష్ 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.3వ వార్డులో టీడీపీ అభ్యర్థి యారమాటి గంగరాజు 236 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
4వ వార్డు టీడీపీ అభ్యర్థి గుండు రామ తులసి 148 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
5వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎర్నేన ప్రభావతి 224 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 6వ వార్డు - టీడీపీ అభ్యర్థి కాశిన కాశీ విశ్వనాధం 17 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్ 40 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 8వ వార్డు వైసీపీ అభ్యర్థి మందపల్లి రవి కుమార్ 192 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.9వ వార్డు టీడీపీ అభ్యర్థి చుండ్రు చిన సుబ్బారావు చౌదరి 11 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 10వ వార్డు టీడీపీ అభ్యర్థి సిరంగుల జ్యోతి 70 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.11వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొవ్వాడ బేబి విజయం సాధించారు.12వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మలసాని సీతా మహలక్మి విజయం పొందారు.13వ వార్డు వైఎస్సార్సీపి అభ్యర్థి పిల్లి గణేశ్వరరావు విజయం పొందారు.
14వ వార్డు వైఎస్సార్సీపి అభ్యర్థిని శెట్టి కళ్యాణి విజయం పొందారు.15వ వార్డు వైయస్సార్సీపి అభ్యర్థి గ్రంధి వీర వెంకట శ్రీనివాస్ విజయం పొందారు.16వ వార్డు వైఎస్సార్సీపి అభ్యర్థి మెండు బాపిరాజు విజయం సాధించారు.
17వ వార్డు టి.డి.పి. అభ్యర్థిని కాళ్ళకూరి స్వరాజ్య భవానీ విజయం సాధించారు.
18వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నాయుడు లక్ష్మి సౌజన్య విజయం పొందారు.
19వ వార్డు వైఎస్సార్సీపి అభ్యర్థి వేగుళ్ళ నారాయణరావు విజయం సాధించారు.
20వ వార్డు వైఎస్సార్సీపి చైర్మన్ అభ్యర్థిని పతివాడ నూక దుర్గా రాణి విజయం పొందారు.
21వ వార్డు టీడీపీ అభ్యర్థి చింతలపూడి దుర్గ 100 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

22 వ వార్డు వైసీపీ అభ్యర్థి బొక్క సరస్వతి 162 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.23 వ వార్డు వైసీపీ అభ్యర్థి ముక్కా లోవ లక్ష్మీ 148 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
24వ వార్డు వైసీపీ అభ్యర్థి జొన్నపల్లి విజయలక్ష్మి 270 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
25 వార్డు వైసీపీ అభ్యర్థి ముక్కా మేరీ స్వరూపా రాణి 225 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.26వ వార్డు వైసీపీ అభ్యర్థి అమలదాసు లక్ష్మీ 43 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.27వ వార్డు వైసీపీ అభ్యర్థి నీలం దుర్గ 245 ఓట్లమెజారిటీ తో గెలుపొందారు.
28వ వార్డు వైసీపీ అభ్యర్థి మొండి భవాని 367 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.29వ వార్డు వైసీపీ అభ్యర్థి పిల్లి శ్రీనివాస్ 164 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
30వ వార్డు వైసీపీ అభ్యర్థి మారిశెట్టి సత్యనారాయణ 300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

14/03/2021

1 నుండి 10 వార్డుల లెక్కింపు పూర్తి అయింది. విజేతలు వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. విజేతల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి*

1వ వార్డులో వైసీపీ అభ్యర్థి పొత్తంశెట్టి ప్రసాద్ 232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

2వ వార్డులో వైసీపీ అభ్యర్థి చిట్టూరి సతీష్ 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

3వ వార్డులో టీడీపీ అభ్యర్థి యారమాటి గంగరాజు 236 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

4వ వార్డు టీడీపీ అభ్యర్థి గుండు రామ తులసి 148 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

5వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎర్నేన ప్రభావతి 224 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

6వ వార్డు - టీడీపీ అభ్యర్థి కాశిన కాశీ విశ్వనాధం 17 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్ 40 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

8వ వార్డు వైసీపీ అభ్యర్థి మందపల్లి రవి కుమార్ 192 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

9వ వార్డు టీడీపీ అభ్యర్థి చుండ్రు చిన సుబ్బారావు చౌదరి 11 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

10వ వార్డు టీడీపీ అభ్యర్థి సిరంగుల జ్యోతి 70 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

04/03/2021

MANDAPETA MUNICIPAL ELECTION NOMINATION LIST:

1 వ వార్డు లో
వైస్సార్ సిపి పోతంశెట్టి ప్రసాద్, టిడిపి పెంకే లోవ కుమార్, జనసేన గండి రాజు.
-------------
2 వ వార్డు లో
వైస్సార్ సిపి చిట్టూరి సతీష్. టీడీపీ కేతా దుర్గా ప్రసాద్.
-----------------
3 వ వార్డు లో
వైస్సార్ సిపి చావా శిరీష్ చౌదరి. టిడిపి యారమాటి గంగరాజు. బీజేపీ ముద్దుల సుబ్బారావు.
--------------------
4 వార్డుల్లో
వైస్సార్ సిపి నుండి మీగడ నాగ రత్న కుమారి.
టీడీపీ గండు రామ తులసీ.
----------------------
5 వ వార్డు లో
వైఎస్సార్సీపీ యర్నన ప్రభావతి. టిడిపి వాకచర్ల వాసంతి.
జనసేన శెట్టి వరలక్ష్మి .
------------------------

6 వ వార్డు లో
వైఎస్సార్సీపీ గోరు సత్యనారాయణ( అన్నవరం).
టీడీపీకాసినకాసివిశ్వనాధం.
జనసేన గెడ్డపు కిరణ్ కుమర్.
----------------------
7 వ వార్డు లో
వైఎస్సార్సీపీ మందపల్లి రుద్రకాంత్.
టీడీపీ చాపల వీరబాబు. స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్. -------------
8 వ వార్డు లో
వైఎస్సార్సీపీ మందపల్లి రవి కుమార్.
టిడిపి పెందుర్తి ప్రదీప్ కుమార్. జన సేన జొన్నడ పాపయమ్మ.
----------------------
9 వ వార్డు లో
వైఎస్సార్సీపీ గురజపు శ్రీనివాస్. టీడీపీ చుండ్రు వీర వెంకట సుబ్బారావు చౌదరి.
జనసేన కనపర్తి వీర్రాజు.
---------------
10 వ వార్డు లో

వైఎస్సార్సీపీ కొప్పిరెడ్డి పద్మావతి. టిడిపి శిరంగి జ్యోతి.
జనసేన టంకాల చిన్ని.
----------------------
11 వ వార్డు లో
వైఎస్సార్సీపీ కొవ్వాడ బేబీ.
టీడీపీ వెంటపల్లి రత్న కుమారి.
-----------------
12 వ వార్డు లో
వైఎస్సార్సీపీ మలసాని సీతామహాలక్ష్మి.
టీడీపీ గడి సత్యవతి.
స్వతంత్ర అభ్యర్థి వాడ్రేవు సత్య దేవి.
----------------------
13 వార్డు లో...

వైఎస్సార్సీపీ పిల్లి గణేశ్వరరావు.
టీడీపీ పలివేల వెంకటేశ్వరరావు.
--------------------
14 వ వార్డు లో
వైఎస్సార్సీపీ శెట్టి కల్యాణి.
టిడిపి ముత్యాల వీర కుమారి. జనసేన గోళ్ళ లీలావతి.
------------------
15 వ వార్డు లో
వైఎస్సార్సీపీ గ్రంధి వీర వెంకట శ్రీనివాస్.
టీడీపీ మేకా శ్రీనివాస్.
జనసేన శెట్టి రవికుమార్.
-----------------
16 వ వార్డు లో
వైఎస్సార్సీపీ మెండు బాపిరాజు.
టీడీపీ గనిశెట్టి వెంకటేశ్వరరావు.
------ ----- -----------
17 వ వార్డులో
వైఎస్సార్సీపీ బొడా జయరేఖ.
టీడీపీ కాళ్లకురి స్వరాజ్య భవాని.
బీజేపీ కడియాల సాయిశ్రీ మహాలక్ష్మి.
----------------------
18 వ వార్డు లో
వైఎస్సార్సీపీ నాయుడు లక్ష్మి సౌజన్య.
టీడీపీ సంకు మాధవి దేవి.
---------------
19 వార్డులో
వైఎస్సార్సీపీ వేగుళ్ళ నారాయణరావు.
టీడీపీ వల్లూరి శ్రీనివాస్.
స్వతంత్ర చోడే సత్య రవి తేజ.
------------------
20 వ వార్డు లో
వైఎస్సార్సీపీ పతి వాడ నుక దుర్గా రాణి.
టీడీపీ మేడింటి కమల కుమారి.
------------------------
21 వ వార్డు లో
వైఎస్సార్సీపీ కంది నాగ శ్రీదేవి. టీడీపీ చింతలపూడి దుర్గ.
----------------
22 వ వార్డు లో
వైఎస్సార్సీపీ బొక్కా సరస్వతి. టీడీపీ రొట్టా లక్ష్మి.
----------------------
23 వ వార్డు లో
వైఎస్సార్సీపీ ముక్కా లోవ లక్ష్మి. టీడీపీ బొడ్డు వెంకట లక్ష్మీ.
–------------------
24 వ వార్డు లో
వైఎస్సార్సీపీ జొన్నపల్లి విజయలక్ష్మి.
టిడిపి కడియాల వెంకట లక్ష్మి. జనసేన నామాల చంద్ర కళ.
---------------------
25 వ వార్డు లో
వైఎస్సార్సీపీ ముక్కా మేరీ స్వరూప రాణి.
టీడీపీ అల్లక పద్మ పొలరాజు.
-------------------
26 వ వార్డు లో
వైఎస్సార్ సిపి ఆమలదాసు లక్ష్మి.
టిడిపి ఎలుబండి సత్యవతి.
--------------------
27 వ వార్డు లో
వైఎస్సార్సీపీ నీలం దుర్గ.
టీడీపీ రాంబిల్లి పాపారావు. జనసేన పిల్లే ఆది నాగేశ్వరరావు. స్వతంత్ర అభ్యర్థి జగ్గా వెంకట రాజు.
----------------------
28 వ వార్డు లో
వైఎస్సార్సీపీ మెండి భవాని.
నల్లి రోజా రాణి.
---------------------
29 వ వార్డు లో
వైఎస్సార్సీపీ పిల్లి శ్రీనివాస్.
టీడీపీ షేక్ ఇబ్రహీం.
-----------------
30 వ వార్డు లో
వైఎస్సార్సీపీ మరిశెట్టి సత్యనారాయణ.
టీడీపీ గుత్తుల సత్తిబాబు.
--------------------------- --------------

21/01/2021

రేపు విద్యుత్ సరఫరా కు అంతరాయం...

శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బైపాస్ రోడ్, సత్యశ్రీ రోడ్, మైయిన్ రోడ్, బస్ స్టాండ్ , టెలి ఫోన్ ఎక్చేంజ్, పల్లీల వీధి , తర్వాణిపేట , విజయలక్ష్మి నగర్, బ్యాంక్ కాలని, ఏడిద రోడ్, పెద్ద కాలువ వంతెన మెహర్ ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

తాపేశ్వరం- మండపేట రోడ్ లో..బోల్తా కొట్టింది గూడ్స్ ఆటో...గొయ్యల తోనే ప్రమాదం...మండపేట:- ప్రమాదాలకు నెలవుగా ఆ రోడ్ మారింద...
21/09/2020

తాపేశ్వరం- మండపేట రోడ్ లో..

బోల్తా కొట్టింది గూడ్స్ ఆటో...

గొయ్యల తోనే ప్రమాదం...

మండపేట:- ప్రమాదాలకు నెలవుగా ఆ రోడ్ మారింది.నిత్యం పదుల సంఖ్యలో వాహనదారులు ఆ గోతుల్లో పడి గాయలపాలవుతున్నారు. అన్ని రోడ్ లు ఇలాగే ఉన్న రాజమహేంద్రవరం వెళ్లే ఈ రహదారి లో ప్రయాణం ఈ ప్రాంతావాసులకు తప్పనిసరి. ఇక్కడి ఇబ్బందులు ఎప్పటికి తీరుతాయో తెలియని పరిస్థితి. కాగా సోమవారం తాపేశ్వరం మండపేట ప్రధాన రహదారిపై వర్షం నీటి తో పెద్ద గొయ్య కనబడక ఓ గూడ్స్ ఆటో ఆ గొయ్య లో పడి పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా అరటి గెలల లోడు కాస్తా తిరగబడి రోడ్ పై చెల్లాచెదురుగా పడ్డాయి.స్థానికులు వెంటనే డ్రైవర్ ను బయటకు తీశారు. ఇలా రోజు ద్విచక్ర వాహనంపై వెళ్లే వారు పడిపోవడం పరిపాటి గా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. ఏ ఊరు లో చూసినా రోడ్డు లు ఇలాగే ఉన్న ఇక్కడి తీవ్రత ను అటు పాలకులు ఇటు అధికారులు గుర్తించడం లేదు.

దినదిన గండం...ఆ రోడ్ పై ప్రయాణం...బురదలో కూరుకు పోయిన వాహనం...నిత్యం ఇదే నరకం...మండపేట:- దక్షిణాదిరాష్ట్రల్లో నే అతి పెద...
20/09/2020

దినదిన గండం...

ఆ రోడ్ పై ప్రయాణం...

బురదలో కూరుకు పోయిన వాహనం...

నిత్యం ఇదే నరకం...

మండపేట:- దక్షిణాదిరాష్ట్రల్లో నే అతి పెద్ద హోల్ సెల్ వస్త్ర మార్కెట్ ఉన్న ప్రాంతం గా ప్రసిద్ధి చెందింది ద్వార పూడి లో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి. ఇక్కడ ప్రయాణం దిన దిన గండం గా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు మార్కెట్ సమీపంలోని రోడ్డు బురద కయ్యా గా రూపంతరం చెందింది.వస్త్ర మార్కెట్ కు వచ్చే లోడ్ వాహనాలు అందులో కురుకుపోతున్నాయి. వాటిని బయటకు తీయాలంటే జేసిబి ల సాయం తీసుకోవాల్సిన పరిస్థితి. పంచాయతీ కి లక్షల్లో ఆదాయం ఉన్న రోడ్ లు మాత్రం ఛిద్రం గానే మిగిలాయి. ముఖ్యంగా రాత్రి పగలు అనే తేడాలేకుండా ఎర్ర బంగారం క్వారీ మట్టి ని కొల్లగొట్టి భారీ టిప్పర్ ల్లో తరలించడమే రోడ్లు ధ్వంసానికి కారణం. పాలకులు మరీనా, ప్రభుత్వాలు ఏవైనా ఇక్కడి రోడ్ లు మాత్రం బ్రిటీష్ జమాన లో నిర్మించారా అనే అనుమానం వచ్చేలా ఉంటాయి.

ప్రమాదకరం...

ద్వారపూడి గ్రామంలో రోడ్డుల పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ద్వారపూడి నుండి మేడపాడు వెళ్లే రోడ్డు, అలాగే రామలింగేశ్వర పేపర్ మిల్ నుండి సాయిబాబా ఆలయం కువెళ్లే ప్రధాన రహదారి, వేములపల్లి పశువుల సంత నుంచి మార్కెట్ కి వెళ్లే రోడ్డు చాలా అద్వాన్నంగా మారాయి. పెద్ద పెద్ద గుంటలు పడడం వలన లారీలు కార్లు గుంటల్లో మునిగి పోతున్నాయి.ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితి గమనించి తక్షణమే ఈ రోడ్ లు నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరారు.

మండపేట లో షాపులు బంద్..చాంబర్ పిలుపు...మండపేట:- కోవిడ్ 19 మహమ్మారిని నియంత్రించేందుకు ఈ నెల 21 నుండి 26వరకూ ఏడూ రోజులు ప...
20/07/2020

మండపేట లో షాపులు బంద్..
చాంబర్ పిలుపు...

మండపేట:- కోవిడ్ 19 మహమ్మారిని నియంత్రించేందుకు ఈ నెల 21 నుండి 26వరకూ ఏడూ రోజులు పాటు వ్యాపారులంతా షాప్ లు మూసి వేయాలని నిర్ణయించినట్లు మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు తెలిపారు. కిరాణా, స్వీట్ షాప్ లకు రెండు రోజులు మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. వారం రోజులు పాటు సెలవు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు ముందస్తుగా సరుకులు తెచ్చుకునేందుకు కిరాణా షాపులకు, నిల్వ చేసే అవకాశం లేనందుకు స్వీట్లు షాప్ లకు ఈ రెండు రోజులు మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. గురువారం నుండి కిరాణా, స్వీట్ షాప్ లు సైతం మూసివేస్తామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి ఉదయం 6 నుండి 11 గంటల వరకే దుకణాలకు అనుమతి**బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే పూర్తి ...
16/07/2020

జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి ఉదయం 6 నుండి 11 గంటల వరకే దుకణాలకు అనుమతి*
*బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తాయి.
జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

Address

Mandapeta
533308

Website

Alerts

Be the first to know and let us send you an email when Mandapeta Official Updates - MOU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share