17/09/2019
త్రిపురాంతకం లో వెలసిన మహిమాన్విత బాల త్రిపుర సుందరీ అమ్మ వారి ఆలయ చరిత్ర:
ఈ అమ్మను భక్తితో కొలిస్తే తప్పక కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం
త్రిపురాంతకం:
శ్రీ శైల క్షేత్రానికి తూర్పు ద్వారమైన 'త్రిపురాంతకం'లో శివుడు ... త్రిపురాంతకుడిగా, పార్వతీ దేవి ... త్రిపురసుందరీదేవిగా భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి కుమారగిరి కింది భాగంలో చెరువు ... దాని మధ్యలో కదంబవృక్షాల మధ్య వెలసిన అమ్మవారి ఆలయం కనిపిస్తుంది.
తారకాసుర సంహారం అనంతరం కుమారస్వామి ఇక్కడే సేదతీరాడుగనుక ఈ కొండకు 'కుమార గిరి' అనే పేరు వచ్చింది. త్రిపురాసుర సంహారం తరువాత ఈ ప్రదేశం త్రిపురాంతకంగా పిలవబడింది. అలాంటి ఈ క్షేత్రాన్ని ఇంద్రుడు సదా పర్యవేక్షిస్తూ ఉంటాడని అంటారు. పరమ శివుడు కొండ పై త్రిపురాంతఈశ్వరుడు గా కొండ పైన ,అమ్మ వారు బాల త్రిపుర సుందరి గా కొండ దిగువ న ఇక్కడ దర్శనం ఇస్తారు.
కాశీ క్షేత్రం లో వలె కాదంబ వృక్షాలు ఎక్కువగాఈ ఆలయ ప్రాంగణం చుట్టూ కనిపిస్తాయి. అతి పురాతన ఆనవాళ్లు కల ఈ ఆలయం లో అనేక వంశాల రాజులు అమ్మవారి ని దర్శించి ఇక్కడ అనేక కట్టడాలు కట్టించారు.
ఆగస్త్య మహాముని ఈ ఆలయం నుండి శ్రీశైలం కు సొరంగ మార్గం నిర్మించారని ప్రస్తుతం దానిని చీకటి గుహ గా పిలుస్తారు. ఇక్కడ ఈశ్వరుని,అమ్మవారి ని దర్శిస్తే సకల పాపాలు హరణం అవుతాయని భక్తుల నమ్మకం
గర్భాలయంలోని మూలమూర్తి కొన్ని వేల సంవత్సరాలనాటిదని చెబుతారు. ఇది తపో సంపన్నులకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. గర్భాలయానికి ద్వారపాలకులుగా భద్రుడు - అనుభద్రుడు కనిపిస్తారు. ఆ తరువాత 12- 13 శతాబ్దాల కాలంలో గణపతి దేవుడి చెల్లెలు 'మైలాంబ' ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసినట్టు ఆధారాలు వున్నాయి. అమ్మవారు రౌద్రమూర్తిగా కనిపించడమే కాకుండా,. విశేషమైనటువంటి పుణ్య దినాల్లో అమ్మవారు పులి ... సింహ ... గజ ... అశ్వ ... శేష ... నెమలి వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుంటుంది.
పల్నాడు చరిత్ర లో కోడి పందేలలో ఓడిన మాచర్ల రాజ్యంవారు అరణ్య వాసం చేసే రోజుల్లో కొంతకాలం మేడపి అడవుల్లో నివశించిన ఆధారాలు ఉన్నవి.బాల చంద్రుడు,బ్రహ్మనాయుడు అమ్మవారిని పూజించి కృప పొందినట్లు చెపుతారు.
పల్నాడు ప్రాంత వెల్దుర్తి గ్రామ శివారు లో ఒక పురాతన నాగేంద్ర స్వామి ఆలయం పునురుద్ధరించ సంకల్పించిన ప్రతి వారికి ఏదో ఒక ఇబ్బంది వస్తు ఉండటంతో ఆ ఆలయం ఆపివేసారు..ఆ గ్రామంలో ఒక వృద్దుడైన పూజారికిఒక రోజు త్రిపురాంతకం అమ్మవారు కలలో కనిపించి ధైర్యంగా ఆలయం పునురుద్దరించు నీకు ఏ ఆపద ఉండదు అని అభయమివ్వగా ఆ పూజారి ఆ ఆలయాన్ని పున: ప్రతిష్ట చేసారు.చేసిన కొన్ని రోజులకు ఒక పెద్ద ప్రమాదంలో పూజారి కి ప్రాణాయయ స్తితి సంభవించ బోగా అమ్మవారు తన మహిమతో రక్షించారు.ఈ విషయం ఇప్పటికి ఈ ప్రాంతంలో చెప్పుకుంటు ఉంటారు ఆ నాగేంద్రస్వామి వారి ఆలయ విశేషాలు మరియు జరిగిన అద్బుత సంఘటన మరో పోస్ట్ లో అందిస్తాను
త్రిపురాశుర సంహానంతరం పరమేశ్వరుడు కుమారగిరి అని పిలవబడే శేషాచలం కొండల్లో ఒకటైన ఈ కొందపై స్వయంభువుగా పార్వతీ సమేతంగా వెలిశాడు. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇక్కడ నడయాడిన ప్రదేశం అగుటచేత,ఇక్కడి నుండి శ్రీశైలానికి గల నాలుగు ద్వారాలలో ఈకుమారగిరి తూర్పు ద్వారంగా విలసిల్లుతోంది. అందుకు తార్కాణంగా ఈ కొండపై గల ఒక గుహద్వారా ఒక సొరంగమార్గం శ్రీశైలానికి గలదు. ఇప్పుడు అందులోనికి వెళ్ళడానికి ఎవరూ సాహసించడంలేదు. ఎందుకంటే పూర్తి అంధకారంగా భయానకంగా ఉండడమే. ఇంకా కొందరేమంటారంటే ఆ గుహ పూడిపోయిందని అంటారు
ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన పరివారదేవతలు కొందరు దుండగుల దాడుల వలన భిన్నమై కనిపిస్తారు. ఈ క్షేత్రంలో వందకు పైగా శిలా శాసనాలు కనిపిస్తాయి. అయ్యవారికి ... అమ్మవారికి సంబంధించిన వివిధ సేవలకుగాను దాతలు సమర్పించిన వాటి వివరాలు ఈ దాన శాసనాల్లో కనిపిస్తుంటాయి.
ఇక ఇక్కడి స్వామివారు మహా సత్యవంతుడని చెబుతారు. పూర్వం ఈ ఆలయం దగ్గర ఒకవ్యక్తి ఒక మూగజీవిని రక్షించడం కోసం మరో వ్యక్తిని హత్య చేశాడు. అయితే అతని మాటలను ఆ గ్రామస్థులు నమ్మలేదు. అతను చెబుతున్నది నిజమేనంటూ స్వామివారి గర్భాలయం నుంచి వినిపించిందట. అందువల ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భావించి భక్తులు విశేష సంఖ్యలో పూజించి తరిస్తుంటారు....శ్రీమాత్రే నమః...
ప్రయణ మార్గం
శ్రీ బాల త్రిపురసుందరి దేవి దేవాలయం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం లో ఉంది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. ఒంగోలు కి 93 కి.మీ కర్నూలు – గుంటూరు రహదారిలోని ఉన్న వినుకొండకు 35 కి. మీ.యర్రగొండపాలెంకు 19 కి. మీ. దూరంలో ఉంది