Guide's Of Godavari District's

Guide's Of Godavari District's Explore Godavari District's with Experience Tour Guides...�

 #నాగులచవితిజంతువులను పూజించడం భారత సనాతన సంప్రదాయంగా వస్తున్న ఆచారం. కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస...
08/11/2021

#నాగులచవితి

జంతువులను పూజించడం భారత సనాతన సంప్రదాయంగా వస్తున్న ఆచారం. కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. అంతేకాకుండా మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు. వేదాల్లో నాగ పూజ కనిపించకున్న.. సంహితాల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తిక శుద్ధ చవితి నాడు నాగు పాములను కొలుస్తారు. దీన్నే నాగుల చవితి అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకు ఎంతో ప్రాముక్యత ఉంది.

Note : పాముకు పాలు అరగవు. పుట్టకు పాలుపోయాలనుకునేవారు పుట్ట దగ్గర ఓ మంట్టి పాత్రను ఉంచి అందులో పాలు పోయాలి అన్నీ నా యొక్క అభిప్రాయం

30/10/2021

#ఆత్రేయపురంపూతరేకులు





పూతరేకులు ఆంధ్రప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ మిఠాయిలు. కొన్ని ప్రాంతాలలో వీటిని పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. పూతరేకులు చేయడం ఒక కళగా భావిస్తారు. ఈ కళ కేవలం తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. జిల్లాలోని ఆత్రేయపురం మండలం గురించి మరేవిధంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహుప్రసిద్ధం.
ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళకళ లాడుతుంటాయి. పూతరేకులు మరికొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరు మాత్రమే ఈ కళలో నిష్ణాతులు.

😍వీరి చేతిలోనే వాటి అసలు రుచి 😍

28/10/2021


 #కోటసత్తెమ్మదేవాలయం 🙏                    శ్రీ కోట సత్తెమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ...
08/10/2021

#కోటసత్తెమ్మదేవాలయం 🙏




శ్రీ కోట సత్తెమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం ఈ ఆలయం ఉంది.

ఆలయం చరిత్ర :

దేవాలయం ప్రాంగణంలో, ఆలయ నిర్హాకులచే ఒకగోడ మీద వ్రాయబడిన సమాచారం ప్రకారం గుడిలోని మూల విగ్రహం 11 వ శతాబ్ది నాటి తూర్పుచాళుక్యుల కాలంనాటిదని తెలియుచున్నది. శ్రివధ్య పురాన్ని పాలించిన కాకతీయరాజు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలందుకొని కాలక్రమేన కనుమరుగై విగ్రహం 1936 సంవత్సరములో తిమ్మరాజు గ్రామంలో గల శ్రీదేవులపల్లి రామమూర్తిగారి పొలములో బయలు పడింది.

ఈ ప్రాంతాన్ని చాలావరకూ నూజివీడు రాజులు పరిపాలించినట్టుగా ఆలయ చరిత్ర పుస్తకాలలో రాయబడిఉన్నది. ఈ గ్రామ పూర్వమమ దేవులపల్లి వారి అగ్రహారంగా పిలువబడినది, ఆగ్రామంలో కృష్ణాజిల్లా అకిరిపల్లి నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన దేవులపల్లి రామ సుబ్బరాయ శాస్త్రి గారి కుమారుడైన శ్రీరామ శాస్త్రి గారి పొలములో పొలం దున్నుతూ ఉండ్గా అమ్మవారి విగ్రహం బయల్పడినది. అయన కొన్నాళ్ళు బయటపడిన ప్రదేశంలోనే పూజాదికాలు నిర్వహించాడు, తరువాత కొంత కాలమునకు ఆయన కలలో కనిపించి దేవాలయము నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించడం వలన తన పొలం కొంతభాగం దేవాలయ నిర్మాణమునకు కేటాయించి 1935లో భక్తులు అమ్మవారి దేవాలయ నిర్మాణం కావించి, చుట్టూ ప్రహరీ కట్టి పూజాదులు నిర్వహించుట మొదలెట్టినారు. అప్పటి నుండి ఆలయము వేగముగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.1976, 77 సంవత్సరాలలో దేవాలయ విస్తరణ కావించారు.. క్రమముగా ఆలయ ప్రాచుర్యం పెరుగుతూ పోవడం వలన మళ్ళీ ఆలయమును పెద్దగా నిర్మించి సాగారు.

Source :

Photo's : 📸

                                             😍 గోదావరి జిల్లాలు😍
30/09/2021






😍 గోదావరి జిల్లాలు😍

        భూలోక  స్వర్గం -   "మన గోదావరి జిల్లాలు" 😍గోదావరి జిల్లాల్లో అందమైన పర్యాట‌క  ప్రదేశాలు : చారిత్రక దేవాలయాలు, వన...
27/09/2021






భూలోక స్వర్గం - "మన గోదావరి జిల్లాలు" 😍

గోదావరి జిల్లాల్లో అందమైన పర్యాట‌క ప్రదేశాలు :
చారిత్రక దేవాలయాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు,
పాపికొండలు, జలపాతాలు, మ్యూజియంలు, కడియం నర్సరీలు, కోనసీమా ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, ప్రాచీన వంతెనలు మరియు కట్టడాలు, బీచ్‌లు, సంస్కృతి మరియు సంప్రదాయాలు, రుచికరమైన ఆహారం మొదలైనవి..

పర్యాటక ప్రదేశం వంటి అన్ని ప్రదేశాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ మరియు స్థానిక యువతకు ఉపాది కల్పించడం వలన ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరుగుతుంది అని నా అభిప్రాయం..🙏

                               చంద్రుడిని వెన్నెల్లో మన పుష్కరఘాట్ వద్ద ఉన్న మహశివుడు 🙏
21/09/2021






చంద్రుడిని వెన్నెల్లో మన పుష్కరఘాట్ వద్ద ఉన్న మహశివుడు 🙏

 #వేమగిరి #శ్రీవేణుగోపాలస్వామిఆలయం #శ్రీశివాలయంఆలయం             వేమగిరి కొండపై వెలసిన           శ్రీ వేణు గోపాలస్వామి ఆల...
14/09/2021

#వేమగిరి
#శ్రీవేణుగోపాలస్వామిఆలయం
#శ్రీశివాలయంఆలయం





వేమగిరి కొండపై వెలసిన

శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం మరియు శివాలయం ఆలయం 🙏

ఈ కొండపై బొబ్బిలి బ్రహ్మన్మ సినిమా చిత్రీకరించబడింది.

         #వేమరామం #వేమగిరిబుద్దవిహర్*32 అడుగుల అశోకుని ధర్మచక్రం*84 అడుగుల నడుస్తున్న బుద్ధభగవానుని విగ్రహం 🙏*జీవకుని అం...
09/09/2021






#వేమరామం
#వేమగిరిబుద్దవిహర్

*32 అడుగుల అశోకుని ధర్మచక్రం

*84 అడుగుల నడుస్తున్న బుద్ధభగవానుని విగ్రహం 🙏

*జీవకుని అందమైన ఔషద మొక్కల వనం

*థాయిలాండ్ ఋద్ధవిగ్రహం ఉన్న ధ్యాన మందిరం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తు ఇస్తే ఈ ప్రదేశం మరింతో గానో అభివృద్ధి చెందుతుంది..

      *కోట‌గుమ్మం*కోట‌గుమ్మం వద్ద నున్న మృత్యుంజయుడి విగ్రహం 🙏కోట‌గుమ్మం చరిత్ర :కోట‌గుమ్మం గోదావరి రైలుస్టేషను వద్ద ఉన్...
06/09/2021





*కోట‌గుమ్మం*

కోట‌గుమ్మం వద్ద నున్న మృత్యుంజయుడి విగ్రహం 🙏

కోట‌గుమ్మం చరిత్ర :

కోట‌గుమ్మం గోదావరి రైలుస్టేషను వద్ద ఉన్న ప్రదేశం. కోట గుమ్మం వద్దనే మృత్యుంజయుడి విగ్రహం, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం, అజంతా హొటలు ఉన్న ప్రదేశాన్ని కోట గుమ్మం అని పిలుస్తారు. ఈ రోజుల్లో ఇక్కడ కోట గుమ్మం కాని లేక గోడ ఏమి కనిపించదు కాని పాక్షికంగా ప్రధాన వీధిలో కనిపిస్తుటుంటుంది, ఈ మార్గం ద్వారానే ఏనుగులు, గుర్రాలు గోదావరి నదికి వచ్చి స్నానం చెయ్యడానికి వెళ్ళేవి. ఈ కోట గోడ రెండు వైపుల వాలుగా ఉంటుంది. ఇక్కడ ఆర్థర్ కాటన్ కుమార్తె సమాధి ఉంది. 1897-1900 సంవత్సరాల మధ్యన రాజమండ్రి గోదావరిపై మీద మొదటి రైలు వంతెన (హేవలాక్ వంతెన) కట్టేటప్పుడు ఈ కోట గుమ్మాన్ని బ్రద్దలు కొట్టారని చెబుతారు. ఈ కోట చాళుక్యులు 8-11 వ సతాబ్ధాలమధ్య నిర్మించబడినదని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఇప్పుడు కందకం వీధి కనిపిస్తుంది. కందకం = పెద్ద కాలువ. గోదావరి నుండి త్రవ్వబడిన ఒక పెద్ద కాలువ. ఈ కందకం శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అడ్డంగా ఈ కాలువ ఉండేది. 20 అడుగులు లోతు, 50 అడుగుల వెడల్పు ఉండేది.

Source : Wikipedia

Address

Rajahmundry
533104

Opening Hours

Monday 8am - 6pm
Tuesday 8am - 6pm
Wednesday 8am - 6pm
Thursday 8am - 6pm
Friday 8am - 6pm
Saturday 8am - 6pm
Sunday 8am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Guide's Of Godavari District's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share