Pushkarayatra

Pushkarayatra Godavari Pushkaram is a festival of River Godavari which occurs once in 12 years.

*🕉 శ్రీరామనవమి 🕉️*  *శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి,గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా ...
27/03/2026

*🕉 శ్రీరామనవమి 🕉️*
*శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి,గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే 'మధ్యాహ్మం 12' గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.*
*ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.*
--------------------------------------
*పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము,రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో* *పట్టాభిషిక్తుడైనాడు.*
*ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే* *జరిగినదని ప్రజల విశ్వాసము,*
*శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.*
---------------------------------------
*ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.*
--------------------------------------- *‘రామ’ యనగా రమించుట అని అర్ధం,కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలెను.*
-------------------------------------- *ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది,*
*దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆఫలితమ కొరకు జపించేది ఇదే సుమా!”అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.*
--------------------------------------
*శ్లో శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే*
------------------------------------
*ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు,భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.*
--------------------------------------
*దుష్టశిక్షణ,శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం‘శ్రీరామ నవమి’గా విశేషంగా జరుపుకుంటాం.*
---------------------------------------
*ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్ర మందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి,వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.*
--------------------------------------
*ఇక భక్త రామదాసు అయితే,శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతో రుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు.*
------------------------------------- *మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు‘రా’ అనగానే మన నోరు* *తెరచుకుని మన లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామ నామ అగ్నిజ్వాలలో పడి దహించుకు పోతాయట!*
*అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట,*
*అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట!*
--------------------------------------
*శ్రీరామ నవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి,సీతారామ కళ్యాణం చేస్తారు,ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.*
-------------------------------------
*( చాగంటి కోటేశ్వరరావు )* ------------------------------------- *మనం పాటించగలిగే రాముని లోకోత్తర గుణం!*
--------------------------------------
*రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అంతకు మునుపే,రాముని జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలు చాలా జరిగాయి,అతని రాజ్యం చేజారిపోయింది, అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది,ఇంకా చాలా కఠినమైన జీవితం గడపలసి వచ్చింది,అతని భార్యను రావణాసురడు అపహరించాడు. ఆమె మీద తనకు ఉన్న ప్రేమ , అనురాగాల వల్ల దక్షిణభారతం చివరి వరకూ వచ్చి, ఒక సైన్యంను ఏర్పరచుకుని, సముద్రం దాటి,లంకకు చేరి, యుద్ధం ప్రకటించి, రావణాసురుని ఓడించి, అతనిని వధించాడు.*
---------------------------------------
*రావణాసురుడికి పదితలలు ఉండేవని మీకు తెలుసు,రాముడు రావణాసురుడిని చంపటానికి వాటినన్నింటినీ నరకవలసిందే,యుద్ధం గెలిచిన తరువాత రాముడు“నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది, ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను, నేను ఒక పరమ శివ భక్తుడిని,ఒక అసాధారణమైన పండితుని,ఒక గొప్ప రాజుని, ఒక ఉదారస్వభావిని వధించాను’’అన్నాడు, మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు, అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు,“మీరు ఏమంటున్నారు? అతను మీ భార్యను అపహరించాడు”* *అన్నాడు. అప్పుడు రాముడు,“అతనికి ఉన్న పదితలలలో చాలా గొప్ప విజ్ఞానం,భక్తి కలది మరియు ఉపాసన చేసినది అయిన ఒకతల ఉంది, దానిని వధించినందుకు నేను చింతిస్తున్నాను”* *అన్నాడు.*
------------------------------------
_*ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు,వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు.*_
---------------------------------------
*అందరికీ పది లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి,ఒక రోజు మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది,మరొక రోజు అసూయతో, ద్వేషంతో,ప్రేమతో, మోహంతో,అందంతో లేదా వికారంగా ఉంటుంది,లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ ఉండవచ్చు,మీరు ఒకరిని ఒక క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయాపరుడు అని నిర్ధారణకు వస్తారు,కానీ నిజంగా,అనేక సమయాలలో,అనేక రకాల తలలు ప్రతివారిలో పని చేస్తూ ఉంటాయి, ప్రతివారికీ ప్రేమతో నిండిన తల, అలానే అందంతో, ఉదారస్వభావంతో లేదా కరుణతో నిండిన తల ఉంటాయి,ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, ఆ మనిషినే వారు పూర్తిగా ఖండిస్తారు.*
--------------------------------------
*రాముడు చెప్పేది ఏమిటంటే రావణాసురడు ఎంత ఘోరమైన పనులు చేసినా,అతని యందు బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది, ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించండి-మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లైతే ఆ తప్పును ఖండించండి, కానీ ఆ మనిషిని కాదు,మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు,మీరు అనవసరమైనటువంటి వాటినుంచి విముక్తులవుతారు,మీరు ఇతరులకు ఇలా చేస్తే, మీకూ అదే జరుగుతుంది.*_
-------------------------------------- *“ప్రేమ అనేది ఒకరంటే ఒకరికి తెలియని స్త్రీ, పురుషుల మధ్య జరుగుతుంది”అని ఎవరో అన్నారు,అది కేవలం అల్పమైన,ప్రతి క్షణం నిర్దారణలు చేసే,జ్ఞానం లేని వారి జీవితంలోనే యదార్ధం,లేకపోతే మీకు ఎవరి గురుంచి ఎంత ఎక్కువగా తెలిస్తే మీకు వారి పట్ల,అంత ఎక్కువ ప్రేమ,కరుణ కలుగుతాయి, మీకు వారి కష్టనష్టాలు అన్నీ తెలిసినట్లయితే, వారూ మీలాంటి మానవత్వం ఉన్న మనిషే అని తెలుసుకుంటారు.*
---------------------------------------
*రాముడు తన భార్యను అపహరించి,ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన వానిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు ఇంత జరిగినా,రాముడు అతని యందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు,అతను ఒక్క గొప్ప జ్ఞానం కలవాడు,అందుకే రాముడిని అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు, అతను జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ, అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను, జ్ఞానాన్ని మార్చలేకపోయింది, జీవితం అతనికి ఏమి చేసినా వాటికి అతను లొంగలేదు.*
--------------------------------------
*దయచేసి మీ చుట్టూ ఉన్నవారందరితో ఈ పని చేయండి,భరించలేనివారు అనుకునే వారిలోనూ మీరు ఒక రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి.*
--------------------------------------- *మీరు రాముని ఈ గుణాన్ని సంవత్సరమంతా గుర్తుంచుకోవాలని నా కోరిక,మీరు ఈ చిన్ని జ్ఞానాన్ని గ్రహించినట్లైతే, మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించగలిగితే గురు పౌర్ణిమ వచ్చి దక్షిణాయానికి వెళ్ళకముందే మీరు మంచి పంట పండించుకోగలరు, ఒక గులాబి మొక్కలో గులాబి పూలకన్నా ముళ్ళు ఎక్కువుగా ఉంటాయి, అయినా మనం దానిని రోజా మొక్కే అంటాము, ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి,ఒక మామిడి చెట్టులో పండ్లకన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి,అయినా మనం దానిని మామిడి చెట్టే అంటాము,ఎందుకంటే మనం ఆ పండ్లలోని మాధుర్యాన్ని గుర్తించాం కాబట్టి.*
--------------------------------------
*ప్రతి మనిషిలోను కనీసం ఒకటైనా తియ్యని అంశం ఉంది,మనం దానిని ఎందుకు చూడకూడదు? దయచేసి ఈ పని చేయండి – మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి,మీరు ఇతరులలో అది ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడు మీలో కూడా అది గుర్తించబడుతుంది, అదేవిధంగా,మీరు ఇతరులలో భయంకరమైనవి చూస్తున్నట్లైతే, మీవిషయంలోనూ అదే జరుగుతుంది,దీని అర్ధం మీరు అన్నింటికీ అంధులు కావాల్సిన అవసరం లేదు, మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులను చూస్తారు, గులాబి మొక్కకు ఉన్న ముళ్ళను చూస్తారు కానీ ఆమామిడి పళ్ళను,గులాబి పూలను గుర్తిస్తారు,మీరు చేయవలసినది అంతే పదండి,ఈ ఆశయాన్ని సాధిద్దాం.*
------------------------------------
*🙏🏻సర్వే జనాః సుఖినోభవంతు🙏🏻*
-----------------------------------
🙏🏻 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*🙏🏻
---------------------------------------

27/03/2026

🥭🍐🍇🫐🥥🍎🍌🥝🍑

*వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు*

🍇🍇🍇🍇🍇🍇🍇


*🥥కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం )*

భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

*🍌అరటి పండు*

భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

*🫐నేరెడు పండు*

శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదా న్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

*🍇ద్రాక్ష పండు*

భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.


*🥭మామిడి పండు*

మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

*🫒అంజూర పండు*

భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.


*🥔సపోట పండు*

సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.


*🍎యాపిల్ పండు*

భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.


*🍊కమలా పండు*

భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

*🍐పనసపండు*

పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

*🌾పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*

1. జన్మ సూతకము.
2. మృత సుతకము.
3. రజః సూతకం .
4. అంటు (రొగ ) సూతకం .
5. శవదర్శన సూతకం ...

🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺

పారిజాత పుష్పాల ఆధ్యాత్మిక విశిష్టత  క్రింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా?• పారిజ...
19/03/2026

పారిజాత పుష్పాల ఆధ్యాత్మిక విశిష్టత

క్రింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా?

• పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది.
• ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.
• పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనం లో ఉద్భవించింది.

• తర్వాత విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లగా, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడు.
ఎందుకు కిందపడిన పుష్పాలనే వాడాలి?
• సాధారణంగా పూలను కోసి పూజ చేస్తారు.
• కానీ పారిజాత పువ్వు మాత్రం భూమిని తాకిన తర్వాత మాత్రమే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెబుతుంది.
• ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం
• అందుకే కిందపడిన పువ్వు భూమిని తాకిన తర్వాతే పవిత్రమవుతుంది.
• కిందపడిన పువ్వులను మాత్రమే ఆవుపేడతో అలికిన నేల నుండి ఏరుకొని దేవుడికి సమర్పించాలి.

పారిజాతం ఇంటి ఆవరణలో ఉంటే…
ఆ ఇంటిలో ఎప్పుడూ సిరి సంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయి అని పురాణ వచనం.
పారిజాతం పుష్పాల 9 రకాలు
1. ఎర్ర (ముద్ద) పారిజాతం
2. రేకు పారిజాతం
3. తెలుపు–ఎర్ర కాడతో (సాధారణంగా కనిపించేది)
4. పసుపు పారిజాతం
5. నీలం పారిజాతం
6. గన్నేరు రంగు పారిజాతం
7. గులాబీ రంగు పారిజాతం
8. తెల్లని పాలరంగు పారిజాతం
9. ఎర్ర రంగు పారిజాతం ఎరుపు రంగు పారిజాతం విష్ణు ఆరాధనకు వాడరాదు.
ఎందుకంటే ఎరుపు = తమోగుణం కానీ విష్ణువు = సత్వగుణం.
పారిజాతం వరప్రసాదం
• పారిజాత వృక్షం తపస్సు చేసి, “నా పుష్పాలను కోయకూడదు, నేను తానే ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి” అనే వరం పొందింది.
• అందువల్లే కిందపడిన పువ్వులు మాత్రమే పవిత్రం.

పారిజాతం యొక్క పంచస్పర్శ మహిమ
భూ స్పర్శ + మృత్తికా స్పర్శ + జల స్పర్శ + హస్త స్పర్శ + స్వామి స్పర్శ

➡️ ఈ ఐదు స్పర్శలతో కలిసిన పారిజాతం పంచమహా పాతకాలను తొలగిస్తుంది.
అందుకే పారిజాతం పుష్పాలు – కిందపడినవే పవిత్రమైనవు, పూజకు ఉత్తమమైనవి.
పారిజాత పుష్పం భగవంతుని అనుగ్రహానికి దివ్య ద్వారం.
శ్రీ పారిజాత పుష్ప సమర్పణం సమస్త మంగళప్రదం కావాలి

పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం........!!
పారిజాత పుష్పాలు 9 రకాలు.
1.ఎర్ర(ముద్ద)పారిజాతం
2.రేకు పారిజాతం
3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం
(ఎక్కువగా అందుబాటులో ఉన్నది)
4.పసుపు పారిజాతం
5.నీలం పారిజాతం
6.గన్నేరు రంగు పారిజాతం
7.గులాబీరంగు పారిజాతం
8.తెల్లని పాలరంగు పారిజాతం
9.ఎర్ర రంగు పారిజాత

ఎరుపు రంగు పారిజాతం తో విష్ణువును ఆరాధించరాదు.
ఎరుపు తమోగుణం
విష్ణువు సత్వగుణం.

పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి.
చెట్టు నుండి కోసి వాడరాదు.

పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది.

రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.

ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు.
ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.

భూ స్పర్శ,
మృత్తికా(మట్టి)స్పర్శ
జల స్పర్శ
హస్త స్పర్శ
తరువాత స్వామి
స్పర్శ.
ఈ 5 స్పర్శల తోను
పంచ మహా పాతకాలను
పోగొట్టేదే పారిజాతం.

28/09/2025

*దైవాన్ని దేనికోసం ప్రార్ధించాలి?*
➖➖➖

*కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే, ఆ చిట్టా పెరుగుతుంది కాని- దైవబలం పెరగదు.*

*గతంలో ఎందరో చక్రవర్తులు ఈ భూమిని పాలించారు. సుదీర్ఘకాలం పాలన చేశారు. ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో సుఖాలు అనుభవించారు. ఎన్నో అద్భుత నిర్మాణాలు చేశారు. కానీ ఏ ఒక్క మహారాజూ ‘పొందవలసినది పొందాను, అంతా అనుభవించాను’ అనే తృప్తితో గతించలేదు.*

*దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందిన మహావీరుల గురించి మన ఇతిహాసాలు చెబుతాయి. వీరు బాహ్య శత్రువులను జయించారే తప్ప, అంతఃశ్శత్రువులను గెలవలేకపోయారు. ఆ మహావీరులెవ్వరూ మానసిక ఉన్నతికోసం దైవ శక్తులను కోరలేదు. వారి తపస్సులో కేవలం విజయకాంక్ష తప్ప మరొకటి లేదు. ఈ దివ్యాస్త్రాలూ నిష్ఫలమైన సందర్భాలున్నాయి. గొప్ప అస్త్రాలే హనుమను ఏమీ చేయలేకపోయాయని రామాయణం చెబుతోంది.*

*అర్జునుడు వరాలకోసం శ్రీకృష్ణుణ్ని ఆశ్రయించలేదు. అందుకే దివ్యజ్ఞానామృతాన్ని (భగవద్గీత) పొందగలిగాడు. కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే, ఆ చిట్టా పెరుగుతుంది కాని- దైవబలం పెరగదు.*

*దేనివల్ల ఆనందాన్ని, శాంతిని, సంతృప్తిని పొందుతామో తెలియక, మనిషి ఇంద్రియాల చేతిలో మోసపోతున్నాడు. వేటగాడు జింకను వేటాడినట్లే, వాంఛలు మనిషిని వేటాడుతున్నాయి.*

*కల్పవృక్షం ప్రసాదించే భోగాలూ క్షణికానందాన్నే ఇస్తాయి. మనిషి ఎన్ని తీర్థాలను, దేవతలను సేవించినా, విషయవాంఛల నుంచి బయటపడనిదే- ప్రయోజనం ఉండదు.*

*విషయవాంఛలు అనే శత్రుసేన ఈ శరీరాన్ని ఆక్రమించింది. ఇంద్రియాలతో పొందే అనుభూతులే వాటి గజబలగం. కామ క్రోధాదులే వాటి ఆయుధాలు. అహంకారం వాటికి సేనాపతి. ఇంద్రియాలు వాటి పతాకం. దేహమనే రాజ్యంలో అంతరంగమనే రాజప్రాకారాన్ని ఇవి చుట్టుముట్టాయి. బుద్ధి అనే మంత్రిని చీకటి గదిలో బంధించాయి. మనసు అనే రాజును బానిసను చేశాయి.*

*ఎంతటి పరాక్రమశాలి అయినా బాహ్యంగా కనపడే శత్రువులతో తలపడగలడు కాని, కంటికి కనపడకుండా తనలోనే తిష్ఠవేసిన ప్రత్యర్థులతో పోరాడలేడు. ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసంతోనే ఇది సాధ్యమవుతుంది.*

*ఇంద్రియాలను అరణ్యంతో పోల్చారు పెద్దలు. అడవిని సులభంగా దాటాలంటే దాని గురించి తెలియాలి. అలాగే ఇంద్రియాల కిటుకు తెలిస్తే, ఇంద్రియారణ్యాన్ని సులభంగా దాటగలం. ఇంద్రియాలు మనసును ఎలా మాయచేస్తాయో, మనిషి సూక్ష్మదృష్టితో గమనించాలి. చర్మ సౌందర్యంతో మనసును మోహింపజేసే కళ్లు, వాటి వెనకనున్న రక్తమాంసాలను కప్పిపుచ్చుతుంది. సుగంధాలను అందించే ముక్కు, దుర్గంధమైన దేహంలోనే తాను కూడా ఉన్నాననే స్ఫురణను మరపిస్తుంది. రుచులను మనసుకు అలవరచే నాలుక, వాటి చాటున దాగిఉన్న రోగాలను దాచిపెడుతుంది. ఇక శ్రవణేంద్రియమైతే (చెవులు) మనిషిని సత్కార తిరస్కార మాటలతో మభ్యపెడుతుంది. ఇలా అన్ని ఇంద్రియాలూ మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి.*

*మనిషిలోనే ఉంటూ, మనిషిని నడిపించే ఈ ఇంద్రియాలను మనసు స్వాధీనపరచుకోవాలి. వినటం, చూడటం, స్పృశించటం, గ్రహించటం... ఇలా మనం చేసే అన్ని పనులూ ఇంద్రియ కార్యకలాపాలే. ప్రతి ఇంద్రియానికీ దైవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలు ఉంటాయి.*

*సత్కర్మలు, సత్ప్రవర్తన, సత్‌ సాంగత్యం- ఇంద్రియాల్లో దైవప్రవృత్తిని నింపుతాయి. అవి ఇంద్రియారణ్యం నుంచి బయటపడే మార్గం చూపిస్తాయి. బుద్ధి వికాసానికి తోడ్పడతాయి.*

*మనసును ఇంద్రియాలకు దూరంపెట్టి, బుద్ధికి చేరువ చేయాలి. అప్పుడే అంతరంగంలో తిష్ఠవేసిన విషయవాంఛలనే శత్రువులను జయించగలం. ఇంద్రుడు అనే ఇంద్రియాధిపతి (మనసు)కి, బృహస్పతి అనే బుద్ధి హితబోధ చెయ్యాలి

శతగాయత్రి మంత్రావళి...ఓం నమః శివాయ..బ్రహ్మ గాయత్రి :-1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్....
21/09/2025

శతగాయత్రి మంత్రావళి...
ఓం నమః శివాయ..

బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //

విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//

చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//

వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//

ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//

దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//

శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//

సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//

కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//

వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//

శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//

శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//

శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//

శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//

శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//

శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//

శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//

శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//

యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//

శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//

భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//

శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//

శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//

శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//

శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//

శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//

శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//

శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//

శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//

శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//

శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//

శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//

శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//

శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//

శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

సర్వే జనాః స్సుఖినోభవంతు..!

29/08/2025

రుద్ర మాలా మంత్రము - ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత.............!!
ఈ మంత్రం అనేక శక్తివంతమైన బీజాక్షరాలతో మరియు ప్రార్థనలతో కూడినది. ఇది కేవలం శివుడిని, శక్తిని, లక్ష్మీదేవిని కలిపి స్తుతించడం మాత్రమే కాకుండా, అనేక సమస్యల నుండి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

రుద్ర మాలా మంత్రము............
మంత్రం......
ఓం నమో భగవతే శ్రీ శివాయనమః, వం వం వరదాయ రుద్రాయ ఓంకార రూపాయ పార్వతీ ప్రియాయ సకలదురిత విదూరాయ సచ్చితానంద విగ్రహాయ ఐం ఐం ఐం ఐం ఐం క్లీం క్లీం క్లీం క్లీం క్లీం మం మం మం మం మం సౌః సౌః సౌః సౌః సౌః శిం శిం శిం శిం శిం వాం వాం వాం వాం వాం యం యం యం యం యం ఖేం ఖేం ఖేం ఖేం ఖేం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లం లం లం లం లం త్రిశూల హస్తాయ సకల దురిత విదూరాయ ఓం హ్రీం దుం దుర్గాసహితాయ భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ కామినీ మోహినీ నాగినీ యక్ష రాక్షస కూష్మాండ బ్రహ్మరాక్షస భూతభేతాళ చోర కృత్రిమ భూతో భూతోచ్ఛాటనాయ అం ఆం ఇం ఈం సర్వరోగభయం శమయ శమయ ఉం ఊం బ్రహ్మహత్య స్త్రీహత్య, శిశు హత్య గోహత్య మహాపాతకాన్ నాశయ నాశయ నాగకుల చెంచుకుల గరుడకుల మార్జాలకుల పాతకం నిపాతయ నిపాతయ రుం రూం లుం లూం ఎం ఏం ఐం ఐం ఓం ఓం సకలరోగ బాధాన్ విచ్చేదయ విచ్ఛేదయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకట్టు పరవాటు పరవేటు పరజప పరతప పరహోమ పరిఔషదాస్త్ర శస్త్రాన్ విచ్చేదయ విచ్ఛేదయ సర్వశత్రూన్ కంపయ కంపయ మారయ మారయ కటిశూల కుక్షిశూల పార్శ్వశూల పృష్టశూల శిరశ్శూల సర్వ శూలాది గ్రహాన్ ప్రహారయ ప్రహారయ మాం రక్ష రక్ష మమ పరివారాన్ రక్ష రక్ష సర్వజ్వరాన్ సంహారయ సంహారయ అష్టదిక్కు బంధ బంధ శల్యోచ్చాటనాది సర్వాంగ క్రియాన్ విచ్చేదయ విచ్చేదయ మృత్యోర్ మోచయ మోచయ ఓం యం లక్ష్మీసహాయ అపమృత్యు తంతూన్ ఛేదయ ఛేదయ మాం రక్ష రక్ష ఘేం శ్రీం హ్రీం ఐం ఫట్ స్వాహా..

మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు:

* సకల దురిత విదూరాయ: అన్ని రకాల పాపాలు, అశుభాలు మరియు కష్టాలను తొలగించడం.
* పార్వతీ ప్రియాయ: పార్వతీ దేవికి ఇష్టమైనవాడు అని శివుడిని కీర్తించడం.
* భూత, ప్రేత నివారణ: భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, శాకినీ, ఢాకినీ వంటి దుష్ట శక్తుల నుండి రక్షణ.
* రోగ నివారణ: అన్ని రకాల రోగాల నుండి, ముఖ్యంగా బ్రహ్మహత్య, గోహత్య వంటి మహాపాతకాల నుండి విముక్తి.
* శత్రు సంహారం: శత్రువుల వల్ల కలిగే బాధలను నివారించి, వారిని నిర్వీర్యం చేయడం.
* యంత్ర, మంత్ర, తంత్ర నివారణ: ఇతరులు చేసే యంత్ర, మంత్ర, తంత్ర ప్రయోగాల నుండి రక్షణ కల్పించడం.
* శూల నివారణ: కటిశూల (నడుము నొప్పి), కుక్షిశూల (పొట్ట నొప్పి), శిరశ్శూల (తల నొప్పి) వంటి శారీరక బాధలను తొలగించడం.
* అపమృత్యు నివారణ: అకాల మృత్యువు నుండి రక్షించి, ఆయుష్షును పెంచడం.
* కుటుంబ రక్షణ: మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని అన్ని ఆపదల నుండి రక్షించమని ప్రార్థించడం.

ఈ మంత్రంలో శివుని రుద్ర రూపాన్ని ప్రార్థిస్తారు, ఇది దుష్ట శక్తులను సంహరించి, భక్తులను రక్షిస్తుంది. ఈ మంత్రంలోని బీజాక్షరాలు (ఐం, క్లీం, మం, సౌః, శ్రీం మొదలైనవి) అత్యంత శక్తివంతమైనవి. వీటిని గురువు ఉపదేశం లేకుండా జపించడం అంత శ్రేయస్కరం కాదు.

ఈ రుద్ర మాలా మంత్రం ఒక రక్షా కవచంలా పనిచేసి, సకల బాధల నుండి, శత్రువుల నుండి, రోగాల నుండి మరియు అకాల మృత్యువు నుండి కాపాడుతుంది. ఇది శివుడిని, దుర్గను మరియు లక్ష్మీదేవిని కూడా స్తుతిస్తూ, అన్ని రకాల శుభాలను ప్రసాదించమని వేడుకుంటుంది.

విష్ణు సహస్రనామ స్తోత్రమ్🙏విష్ణు సహస్రనామ స్తోత్రన్ని మొత్తం చదవలేని వాళ్ళు వారి జన్మ నక్షత్ర పాదమును బట్టి ఆ శ్లోకమును ...
21/04/2025

విష్ణు సహస్రనామ స్తోత్రమ్🙏

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని మొత్తం చదవలేని వాళ్ళు వారి జన్మ నక్షత్ర పాదమును బట్టి ఆ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

అశ్వని నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- విశ్వo విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః:
భూతకృద్భూతబృద్భావో భూతాత్మా భూతభావన: !!1 !!

అశ్వని నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతి: అవ్యయ: పురుష: సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ !!2!!

అశ్వని నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- యోగో యోగవిదాంనేతా ప్రధానపురుషేశ్వర:
నారసింహవపు: శ్రీమాన్ కేశవ: పురుషోత్తమ:!!3!!

అశ్వని నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- సర్వశ్శర్వ: శ్శివ స్థానుర్భూతాదిర్నిధిరవ్యయ:
సంభవో భావనో భర్తా ప్రభవ: ప్రభురీశ్వర: !!4!!

భరణి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- స్వయం భూ శ్శమ్బూరాదిత్య: పుష్కరాక్షో మహాస్వన:అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమ : !!5!!

భరణి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- అప్రమేయో హ్రుషీ కేశ: పద్మనాభో అమరప్రభు:
విశ్వకర్మా మనుస్త్వస్థా స్థనిష్ట : స్థవిరో ధ్రువ: !!6!!

భరణి నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. అగ్రాహ్య: శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్.117!!

భరణి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. ఈశాన ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధు సూదనః!!8!!

కృత్తిక నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్!!9!!

కృత్తిక నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- శ్లో. సురేశః శరణం శర్మ విస్వరేతా ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః!!10!!

కృత్తిక నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. అజః సర్వేశ్వర స్సిద్దః సిద్ధిః సర్వాది రచ్యుతః
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్మృతః!!11!!

కృత్తిక నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. వసుర్వస్సుమనా స్సత్య: సమాత్మా సంమితస్సమ: అమోఘ: పుండరీ కాక్షో వృష కర్మావృషాకృతి:!!12!!

రోహిణి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వ యోని శ్శుచి శ్రవః
అమృత శ్శాశ్వత స్థాణుర్వరారోహో మహా తపాః!!13!!

రోహిణి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- శ్లో. సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః
వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విద్కవిః!!14!!

రోహిణి నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. లోకాధ్యక్ష, సురాధ్యక్షో, ధర్మాధ్యక్ష, కృతా కృతః
చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా, చతుర్భుజః!!15!!

రోహిణి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. భ్రాజిష్ణు ర్భోజనం భోక్తాః సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః!!16!!

మృగశిర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః శుచి రూర్జితః అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః!!17!!

మృగశిర నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- శ్లో. వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహా బలః!!18!!

మృగశిర నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. మహాబుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహా ద్యుతిః అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రి ధృక్ !!19!!

మృగశిర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసః సతాంగతిః
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః!!20!!

ఆరుద్ర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
హిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః !!21!!

ఆరుద్ర నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- అమృత్యుః సర్వ దృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశృతాత్మా సురారిహా!!22!!

ఆరుద్ర నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. గురు ర్గురుతమో దామ సత్యః సత్య పరాక్రమః
నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః!!23!!

ఆరుద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. అగ్రణీ ర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్ర పాత్...!!24!!

పునర్వసు నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో .ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః
అహః సంవర్తకో వహ్ని రనిలో ధరణీ ధరః!!25!!

పునర్వసు నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- శ్లో. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ దృగ్విశ్వ భుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధు ర్జహ్ను ర్నారాయణో నరః!!26!!

పునర్వసు నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచిః సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః!!27!!

పునర్వసు నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. వృషాహీ వృషభో విష్ణుర్వృష పర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శుచి సాగరః!!28!!

పుష్యమి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైక రూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః!!29!!

పుష్యమి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- శ్లో. ఓజస్తేజో ద్యుతి ధరః ప్రకాశాత్మా ప్రతాపనః
ఋద్ధః స్పష్టాక్షరో మంత్ర శ్చంద్రాంశు భాస్కర ద్యుతిః!!30!!

పుష్యమి నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. అమృతాంశూద్భవో భానుః శశ బిన్దుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్య ధర్మ పరాక్రమః!!31!!

పుష్యమి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః
కామహా కామ కృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః!!32!!

ఆశ్లేష నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. యుగాది కృత్యుగావర్తో నైకమాయో మహాశనః !
అదృశ్యో వ్యక్త రూపశ్చసహస్ర జిదనంత జిత్ !! 33 !!

ఆశ్లేష నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:- శ్లో. ఇష్టో విశిష్టః శిశ్టేష్టః శిఖండీ నహుషో వృషః !
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహు ర్మహీధరః !! 34 !!

ఆశ్లేష నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః !
అపాం నిథి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః !! 35 !!

ఆశ్లేష నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. స్కన్ద స్కన్దధరో ధుర్యో వరదో వాయు వాహనః !
వాసుదేవో బృహద్భాను రాదిదేవః పురన్దరః !! 36 !!

మఘ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో . అశోకస్తారణరస్తారః శూరః శౌరిర్జనేశ్వరః !
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః !!37!!

మఘ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. పద్మనాభోరవిందాక్షః పద్మ గర్భః శరీరభృత్ !
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః !!38 !!

మఘ నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః !
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః !!39!!

మఘ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః !
మహీధరో మహాభాగో వేగవానమితాశనః !! 40 !!

పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ! కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః !! 41 !!

పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధృవః ! పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః !!42!!

పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః ! వీరః శక్తిమతాం శ్రేష్ఠ ధర్మో ధర్మ విదుత్తమః !!43!!

పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో.వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ! హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః !!44!!

ఉత్తర ఫల్గుణి (ఉత్తర) నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ! ఉగ్రః సంవత్సరో దక్ష విశ్రామో విశ్వ దక్షిణః !!45!!

ఉత్తర ఫల్గుణి (ఉత్తర) నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం ! అర్థో నర్థో మహా కోశో మహా భోగో మహాధనః !!46!!

ఉత్తర ఫల్గుణి (ఉత్తర) నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. అనిర్విణ్ణ స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః !నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః !!47!!

ఉత్తర ఫల్గుణి (ఉత్తర) నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ! సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ !!48!!

హస్త నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ః ! మనోహరో జిత క్రోధో వీరబాహు ర్విదారణః !!49!!

హస్త నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్ !
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః !!50!!

హస్త నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. ధర్మగుబ్ధర్మ కృద్ధర్మీ సదసత్ క్షరమ క్షరమ్ !
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః !!51!!

హస్త నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. గభస్తినేమి సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః !
ఆది దేవో మహా దేవో దేవేశో దేవ భృద్గురుః !!52!!

చిత్త నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞాన గమ్య పురాతనః !
శరీర భూత భృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః !!53!!

చిత్త నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. సోమపోమృతపః సోమః పురుజిత్పురుసత్తమః !
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాంపతిః !!54!!

చిత్త నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః !
అంభోనిథి రనంతాత్మా మహోదధి శయోన్తకః !!55!!

చిత్త నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో . అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర: ప్రమోదన:!
ఆనందో వందనో నంద:సత్యధర్మా త్రివిక్రమ: !!56!!

స్వాతి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో . మహర్షి: కపిలాచార్య: కృతజ్ఞో మేది నీపతి:!
త్రిపద త్రి దశా ధ్యక్షో మహశ్రుంగ: క్రుతాంతకృత్ !!57!!

స్వాతి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. మహా వరాహో గోవిందః సుషేణః కనకాంగదీ !
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః !! 58 !!

స్వాతి నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః ! వరుణో వారణో వృక్షః పుష్కరాక్షో మహామనః !! 59!!

స్వాతి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః !
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః !! 60 !!

విశాఖ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. సుధన్వా ఖండ పరశు ర్దారుణో ద్రవిణ ప్రదః !
దివః స్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః !! 61 !!

విశాఖ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ! సన్న్యాస కృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్ !! 62 !!

విశాఖ నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ! గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృష ప్రియః !! 63 !!

విశాఖ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా కేమ కృచ్ఛివః !
శ్రీవత్స వక్షః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః !! 64 !!

అనూరాధ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీ విభావనః !
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోక త్రయాశ్రయః !! 65 !!

అనూరాధ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతి ర్గణేశ్వరః ! విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్ఛిన్నసంశయః !! 66 !!

అనూరాధ నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. ఉదీర్ణః సర్వత శ్చక్షు రనీశః శాశ్వత స్థిరః !
భూశయో భూషణో భూతి ర్విశోకః శోక నాశనః !! 67 !!

అనూరాధ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:- శ్లో. అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః ! అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మిత విక్రమః !! 68 !!

జ్యేష్ట నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. కాలనేమినిహా వీరః శౌరిః శూర జనేశ్వరః !
త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిహా హరిః !! 69 !!

జ్యేష్ట నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. కామ దేవః కామపాలః కామీ కాంత కృతాగమః !
అనిర్దేశ్యవపు ర్విష్ణుః ర్వీరోనంతో ధనంజయః !! 70 !!

జ్యేష్ట నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ వివర్ధనః !
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః !! 71 !!

జ్యేష్ట నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో. మహాక్రమో మహా కర్మా మహా తేజా మహోరగః !
మహా క్రతు ర్మహా యజ్వా మహా యజ్ఞో మహా హవిః !! 72 !!

మూల నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. స్తవ్య స్తవప్రియః స్తోత్రమ్ స్తుతిః స్తోతా రణప్రియః ! పూర్ణః పూరయితాః పుణ్యః పుణ్య కీర్తి రనామయః !! 73 !!

మూల నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో.మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః !
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః !! 74 !!

మూల నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ! శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః !! 75 !!

మూల నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో. భూతా వాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః !దర్పహా దర్పదా దృప్తో దుర్ధరో థాపరాజితః !! 76 !!

పూర్వాషాడ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. విశ్వ మూర్తి ర్మహా మూర్తి ర్దీప్త మూర్తి రమూర్తి మాన్ ! అనేక మూర్తి రవ్యక్తః శతమూర్తిః శతాననః !! 77 !!

పూర్వాషాడ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. ఏకో నైకః సవః కః కిమ్ యత్తత్పదమనుత్తమమ్ ! లోక బంధు ర్లోక నాథో మాధవో భక్త వత్సలః !! 78 !!

పూర్వాషాడ నక్షత్ర తృతీయ పాద శ్లోకం:- శ్లో. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ ! వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచలశ్చలః !! 79 !!

పూర్వాషాడ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో. అమానీ మాన్యదో మన్యో లోకస్వామీ త్రిలోక ధృక్ ! సుమేధా మేధజో ధన్య సత్యమేధా ధరా ధరః !! 80 !!

ఉత్తరాషాడ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:- శ్లో. తేజో వృషో ద్యుతి ధరః సర్వ శస్త్ర భృతాం వరః ! ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః !! 81 !!

ఉత్తరాషాడ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః ! చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద విదేకపాత్ !! 82 !!

ఉత్తరాషాడ నక్షత్ర తృతీయ పాద శ్లోకం:-శ్లో. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ! దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా....!! 83 !!

ఉత్తరాషాడ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో. శుభాంగో లోకసారంగః సుతంతు స్తంతు వర్ధనః !ఇంద్ర కర్మా మహా కర్మా కృత కర్మా కృతాగమః !! 84 !!

శ్రవణం నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:-శ్లో. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః !ఆర్కో వాజనసః శృంగీ జయంతః సర్వ విజ్జయీ !! 85 !!

శ్రవణం నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో . సువర్ణ బిందు రక్షోభ్య: సర్వనాగీశ్వరేశ్వర:
మహాహ్రాదో మహాగర్తో మహాభూతో మహానిధి: !!86!!

శ్రవణం నక్షత్ర తృతీయ పాద శ్లోకం:-శ్లో. కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోనిలః !
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః!! 87!!

శ్రవణం నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో. సులభః సువ్రతః సిద్ధః శత్రు జిచ్ఛత్రుతాపనః !
న్యగ్రోధోదుంబరోశ్వత్థ శ్చాణూరాంధ్ర నిషూదనః !! 88 !!

ధనిష్ట నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:-శ్లో. సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధాః సప్త వాహనః !
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః !! 89 !!

ధనిష్ట నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. అణు ర్బృహ త్కృశః స్థూలో గుణ భృన్ని ర్గుణోమహాన్ ! అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః !! 90 !!

ధనిష్ట నక్షత్ర తృతీయ పాద శ్లోకం:-శ్లో. భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః !
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణః వాయువాహనః !! 91 !!

ధనిష్ట నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః !
అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః !! 92 !!

శతభిషం నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:-శ్లో. సత్త్వవాన్ సాత్వికః సత్యః సత్య ధర్మపరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతి వర్ధనః !! 93 !!

శతభిషం నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. విహాయ సగతి ర్జ్యోతిః సురుచిర్హుత భుగ్విభుః ! రవి విరోచః సూర్యః సవితా రవిలోచనః !! 94 !!

శతభిషం నక్షత్ర తృతీయ పాద శ్లోకం:-శ్లో. అనంతో హుతభుక్భోక్తా సుఖదో నైకజోగ్రజః !
అనిర్వణ్ణః సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః !! 95 !!

శతభిషం నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో. సనాత్సనాతనతమః కపిలః కపి రవ్యయః
స్వస్తిదః స్వస్తి కృత్ స్వస్తిః స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః !! 96 !!

పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:-శ్లో. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః !
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః !! 97 !!

పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ! విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః !! 98 !!

పూర్వాభాద్ర నక్షత్ర తృతీయ పాద శ్లోకం:-శ్లో. ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుః స్వప్న నాశనః ! వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః !! 99 !!

పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో. అనంత రూపోనంత శ్రీర్జితమన్యు ర్భయాపహః ! చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః !! 100 !!

ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:-శ్లో. అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః !జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః !! 101 !!

ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో. ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః ! ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః !! 102 !!

ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాద శ్లోకం:-శ్లో . ప్రమాణం ప్రాణవిలయ: ప్రాణబృత్ప్రాణజీవన: తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగ:!!103!!

ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో . భూర్భువస్సుస్తరుస్తార: సవితా ప్రపితా మహా: యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాజ్ఞాంగో యజ్నవాహన:!!104!!

రేవతి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం:-శ్లో . యజ్ఞబృద్యజ్ఞ కృద్యజ్ఞీ యజ్ఞ భుగ్యజ్ఞసాధన:
యజ్ఞాంత కృద్యజ్న గుహ్యమన్నమన్నాద ఏవచ. !!105!!

రేవతి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం:-శ్లో . ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయన: దేవకీ నందన స్ప్రష్టా క్షితీశ: పాపనాశన: !!106!!

రేవతి నక్షత్ర తృతీయ పాద శ్లోకం:-శ్లో. శంఖబృనందకీ చక్రీ సారంగాధన్వా గదాధర:
రదాంగ పాణి రక్షోభ్య: సర్వ ప్రహరణాయుధ: !!107!!

రేవతి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం:-శ్లో . శ్రీ సర్వప్రహనాయుధ ఒన్నమైతి!!
వనమాలీగదీ శార్గీ శమ్ఖీ చక్రీ చ నందకీ, శ్రీ మన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు !!108!!

Address

20-327, Dinakar Nagar
Secunderabad
500015

Alerts

Be the first to know and let us send you an email when Pushkarayatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pushkarayatra:

Share

Category