11/03/2025
శ్రీకాకుళంలో మత్స్యకారుల కోసం సముద్ర మౌలిక సదుపాయాల అవసరం గురించి గౌరవనీయులైన కేంద్ర పోర్ట్స్ , షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గారిని కలిసాము. సుమారు 150 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నప్పటికీ, సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నుండి చాలా మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం పశ్చిమ తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, కేరళ మరియు కర్ణాటకకు వలస వెళ్ళవలసి పరిస్థితులను వివరించాము.
ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడం కోసం, సంతబొమ్మలి మండలంలోని భావనపాడు గ్రామంలో ఒక ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించాలని, వజ్రపుకోత్తూరు మండలంలోని మంచినీళ్లుపేట మరియు గారా మండలంలోని కళింగపట్నంలో ఫిషింగ్ జెట్టీలను నిర్మించాలని కోరాము.ఈ ప్రాజెక్టులు వల్ల స్థానిక ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు వలసలను తగ్గించడంలో మరియు తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సానుకూలంగా స్పందించిన శ్రీ సర్బానంద సోనోవాల్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Had a fruitful discussion with Shri ji, Hon’ble Union Minister of Ports, Shipping and Waterways, regarding the urgent need for marine infrastructure in my constituency, Srikakulam. Despite having a coastline of about 150 kilometers, the lack of proper facilities has forced many fishermen from the region to migrate to the western coastal states of Gujarat, Kerala, and Karnataka in search of livelihood.
To address this long-standing issue, I have requested the construction of a fishing harbour in Bhavanapadu village of Santhabommali Mandal, along with fishing jetties in Manchineellupeta of Vajrapukothuru Mandal and Kalingapatnam of Gara Mandal. These projects will play a vital role in creating local employment opportunities, reducing migration, and strengthening the coastal economy.
Ensuring sustainable livelihoods for our fishing communities is a priority, and I remain committed to working towards this goal. I thank Shri Sarbananda Sonowal ji for his time and support and look forward to positive developments in this regard.