Travel2Tirupati

Travel2Tirupati Tirupati travels , tirupati tours and travels

31/12/2025

ముక్కోటి శోభతో వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల.

31/12/2025

అపూర్వ వైకుంఠ శోభ: భక్తుల ప్రశాంత నిరీక్షణ!

ఎన్నడూ లేని విధంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ​సాధారణంగా ఇంతటి రద్దీ ఉన్నప్పుడు అలజడి కనిపిస్తుంది. కానీ, ఇక్కడ ఆశ్చర్యకరంగా క్యూలైన్లలో భక్తుల మొహాల్లో నిశ్చలమైన ప్రశాంతత గోచరిస్తోంది. గంటల తరబడి వేచి ఉన్నా, ఎంతో క్రమశిక్షణతో, రామనామ స్మరణతో భక్తితో వేచి ఉండటం ఇటీవలి కాలంలో మనం చూడని ఒక అరుదైన దృశ్యం.

16వ శతాబ్దంలో చోళ మరియు విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ అద్భుత కట్టడం, శిల్పకళా సౌందర్యానికి నిలయం. మహాకవి బమ్మెర పోతన తన 'ఆంధ్ర మహాభాగవతాన్ని' ఈ రామయ్య సన్నిధిలోనే రచించారు. దీనికి గుర్తుగా ఆలయంలో ఆయన విగ్రహాన్ని నేటికీ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలపై (ఏకశిల) చెక్కబడి ఉండటం అత్యంత విశేషం. శ్రీరాముడు ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు హనుమంతుడిని ఇంకా కలవని కారణంగా, ఈ ఆలయ గర్భాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత.

' దేవుని కడప' లో.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్టలోని ఏకశిలా నగరం, తెల్లవారుజాము నుంచే భక్తులు ఇలా బారులు తీరి ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా ఏర్పాట్లు చేసి శోభాయమానంగా దర్శించుకొనేలా చేసి భక్తులను చక్కటి ఆధ్యాత్మికను అనుభవించేలా చేశారు.

30/12/2025

శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు - వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతోంది - 12:05 గంటలకు వైకుంఠ ద్వార తలుపులను తెరిచారు - 1:20 గంటలకు ప్రముఖుల దర్శనాలను ప్రారంభించాం - టోకెన్లు లేని భక్తులు జనవరి 2న రావాలి : టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్.. ముందుగానే శ్రీవారి దర్శనాలు ప్రారంభించాం - ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం - కట్టుదిట్టంగా ఉత్తర ద్వార దర్శనాలు కల్పించాం : టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

30/12/2025

కోనసీమ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామి వారి తొలి హారతి మరియు ఉత్తర ద్వార దర్శనం..🙏🏻

వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విస్తృత ఏర్పాట్ల...
30/12/2025

వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుద్దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తితిదే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అలంకరణలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠాన్ని చూడచక్కగా ముస్తాబు చేశారు. వైకుంఠ ప్రదర్శన మార్గంలోని అలంకరణకు ప్రత్యేకమైన పూలను వినియోగించారు. శ్రీవారి ఆలయం ఎదుట అలంకరణ భక్తులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాకారాలు, గోపురాలు రంగురంగుల విద్యుద్దీపాలతో మిరమిట్లు గొల్పుతున్నాయి. వైకుంఠ ప్రదక్షిణ చేసే భక్తులు దైవలోకాన్ని చూసిన అనుభూతి పొందేలా తితిదే ముస్తాబు చేసింది.
..

శ్రీవారి ఆలయం లోపల పుష్పాలంకరణ
30/12/2025

శ్రీవారి ఆలయం లోపల పుష్పాలంకరణ

Tirumala Temple 🙏
29/12/2025

Tirumala Temple 🙏

24/12/2025

*వైకుంఠ ద్వార దర్శనాలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు*

*తొలి మూడు రోజులు టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం*

*ఆరోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనం ఉండదు*

*భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు*

*చివరి ఏడు రోజుల్లో టోకెన్ పొందలేని భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం*

*టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు*

తిరుమల, 2025 డిసెంబర్ 23: డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ సోషియల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.

గత రెండు నెలలుగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్ల కోసం టీటీడీ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోందని తెలిపారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిలకు ఈ-డిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయించామని చెప్పారు. ఈరోజుల్లో టోకెన్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని, టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చని స్పష్టం చేశారు. కాకపోతే టోకెన్ లేని భక్తులకు దర్శనాలు లేకపోవటంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పారు.

టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2వ తేది నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వారా దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ బస్సుల్లో బ్యానర్లు, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్రాడ్ కాస్టింగ్, టీటీడీ సోషియల్ మీడియా, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.

టీటీడీ సూచనలు పాటిస్తూ భక్తులందరూ సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా చైర్మన్ భక్తులకు తెలియజేశారు.

*టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.*

05/12/2025

Tirupati Andhra Pradesh 360 View

కార్తీక పర్వ దీపోత్సవం కోసం ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగిపోవడంతో తిరుమల పవిత్ర కొండలు దివ్య వైభవంతో వెలిగిపోయాయి, ఇది స్వచ...
05/12/2025

కార్తీక పర్వ దీపోత్సవం కోసం ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగిపోవడంతో తిరుమల పవిత్ర కొండలు దివ్య వైభవంతో వెలిగిపోయాయి, ఇది స్వచ్ఛత, భక్తి మరియు శుభాల ఆశీర్వాదాలను సూచిస్తుంది.
#తిరుమల #కార్తీకదీపోత్సవం #సనాతనధర్మ

Address

Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when Travel2Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category